Courtesy BCCI
IPL 2025: వాటే మ్యాచ్.. ఇదీ కదా మ్యాచ్ అంటే.. ఇదీ కదా అభిమానులు కోరుకునేది.. బాల్ బాల్ కి నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని మలుపులు, బంతి బంతికి బీపీ పెరిగిపోయింది. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగిన తీరు ఇది. ఈ మ్యాచ్ ఐపీఎల్ లవర్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. లో స్కోర్ మ్యాచ్ అయినా కావాల్సినంత మజా దొరికింది. అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నరాలు తెగేంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కేకేఆర్ పై పంజాబ్ సంచలన విజయం నమోదు చేసింది. చేసింది లో స్కోర్ అయినా డిఫెండ్ చేసుకుంది. 16 పరుగుల తేడాతో కేకేఆర్ ని చిత్తు చేసింది పంజాబ్.
పంజాబ్ చేసింది 111 పరుగులే కావడంతో కేకేఆర్ గెలుపు ఖాయం అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, పంజాబ్ అద్భుతంగా పోరాడింది. కేకేఆర్ బ్యాటర్లకు పంజాబ్ బౌలర్లు చుక్కలు చూపించారు. 95 పరుగులకే ఆలౌట్ చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంతితో మ్యాజిక్ చేశారు. కేకేఆర్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. పంజాబ్ బౌలర్ల దెబ్బకు కేకేఆర్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 15.1 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. పంజాబ్ చేతిలో పరాజయం పాలైంది.
కేకేఆర్ జట్టులో రఘువంశీ 37 పరుగులు, రహానె 17 పరుగులు, రస్సెల్ 17 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీసి కేకేఆర్ వెన్ను విరిచాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. జాన్ సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. బార్ట్ లెట్, అర్ష్ దీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు. ఈ సంచలన విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ ఘనత సాధించింది.
ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది నాలుగో విజయం. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన పంజాబ్ రెండింటిలో ఓడిపోయింది. కేకేఆర్ పై సంచలన విజయంతో పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది.
అటు ఈ సీజన్ లో కేకేఆర్ కి ఇది నాలుగో పరాజయం. ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన కేకేఆర్..మూడింటిలో గెలుపొందింది. తాజా ఓటమితో పాయింట్ల టేబుల్ లో 5వ స్థానం నుంచి 6వ ప్లేస్ కి పడిపోయింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here