IPL 2025: ఇది నా అడ్డా..! కేఎల్ రాహుల్ కు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి ‘ఇది నా మైదానం’ అంటూ..

Credit BCCI
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య విజృంభించడంతో సునాయసంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.
Also Read: IPL 2025: మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య గొడవ.. అసలేం జరిగిందంటే..? వీడియో వైరల్
తొలుత ఢిల్లీ క్యాపిటల్ జట్టు బ్యాటింగ్ చేయగా ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (41), స్టబ్స్ (34) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ (51), కృపాల్ పాండ్య (73నాటౌట్) రాణించడంతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.
Also Read: IPL 2025 : చెలరేగిన కృనాల్ పాండ్య, ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి ‘ఇది నా మైదానం’ అంటూ ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈనెల 12న బెంగళూరులో ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ‘కాంతారా’ స్టైల్ లో బ్యాట్ తో మైదానంలో రౌండ్ గీత గీస్తూ ‘ఇది నా హోంగ్రౌండ్’ రాహుల్ ప్రకటించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ విజయం సాధించడంతో మ్యాచ్ అనంతరం రాహుల్ వద్దకు వెళ్లిన కోహ్లీ.. ‘ఇది నా గ్రౌండ్’ అంటూ చేతితో రౌండ్ గీస్తూ రాహుల్ ను ఆటపట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
kohli😂❤️🫶🏻 https://t.co/7Nx1wejHw8 pic.twitter.com/otniekWn7Y
— S A K T H I ! (@Classic82atMCG_) April 27, 2025