ఐపీఎల్-2025 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

ఐపీఎల్ -2025 సీజన్‌లో అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న టాప్-5 బౌలర్లు, బ్యాటర్లు వీరే..

ఐపీఎల్-2025 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

Updated On : June 4, 2025 / 9:19 AM IST

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజేతగా నిలిచింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది. ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరడంతో విరాట్ కోహ్లీ బావోద్వేగానికి గురయ్యాడు. దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ సంబురాలు మిన్నంటాయి. అర్ధరాత్రిళ్లు రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ ఆర్సీబీ అంటూ కేకలు వేస్తూ, టపాసులు కాల్చుతూ, స్వీట్లు తినిపించుకుంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే, ఈ ఐపీఎల్ -2025 సీజన్ లో అద్భుత బౌలింగ్, బ్యాటింగ్ తో ఆకట్టుకున్న టాప్-5 బౌలర్లు, బ్యాటర్ల వివరాలు పరిశీలిస్తే..

Also Read: IPL 2025 Final: ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..

గుజరాత్ టైటాన్స్ డాషింగ్ బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్ ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేశాడు. 759 పరుగులుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ కుగాను అతను ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. దీంతోపాటు రూ.10లక్షల ఫ్రైజ్ మనీ చెక్ కూడా అందుకున్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఈ ఆటగాడు 15 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ గెలుచుకున్నందుకు ప్రసిద్ధ్ కృష్ణ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు.

Also Read: Allu Arjun: ఆర్సీబీ విజయంతో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ఫుల్ ఎమోషనల్.. నెత్తిపై నీళ్లు పోసుకొని.. కింద పడుకొని ఫన్నీగా సెలబ్రేట్‌.. వీడియో వైరల్

అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు వీరే…
సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) : 759
సూర్యకుమార్ యాదవ్ (ముంబయి ఇండియన్స్) : 717
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) : 657
శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) : 650
మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్) : 627

అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్లు వీరే..
ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) : 25
నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) : 24
హేజిల్ వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) : 22
ట్రెంట్ బౌల్ట్ (ముంబయి ఇండియన్స్) : 22
అర్ష్ దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) : 21

ఫ్రైజ్ మనీ..
విజేత జట్టుకు (ఆర్సీబీ) : రూ.20కోట్లు
రన్నరప్ జట్టుకు (పంజాబ్ కింగ్స్) : రూ.12.5కోట్లు.
క్వాలిఫయర్స్ : రూ.7 కోట్ల చొప్పున
ఎలిమినేటర్ : రూ.6.5కోట్ల చొప్పున

ఎక్కువ సిక్సులు : నికోలస్ పూరన్ (40 సిక్సులు, లక్నో సూపర్ జెయింట్స్)
బెస్ట్ క్యాచ్ : కమిందు మెండిస్ (సన్ రైజర్స్ హైదరాబాద్)