IPL 2025: తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. బౌండరీల మోతమోగింది..
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

Courtesy BCCI
IPL 2025 Virat Kohli: ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్లు తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ జట్టుపై ఆర్సీబీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Also Read: IPL 2025: అయ్యో రసూల్.. అనుకుందొకటి.. అయిందొకటి.. బిగ్ షాకిచ్చిన సుయాశ్.. వీడియో వైరల్
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు కేవలం 16.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 177 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (36బంతుల్లో 59 నాటౌట్) ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు కొట్టాడు. ఈ క్రమంలో కోల్ కతాపై కోహ్లీ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్ లో నాలుగు జట్లపై వెయ్యికిపైగా పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మ్యాచ్ కు ముందు కోల్ కతాపై విరాట్ కోహ్లీ 962 పరుగులతో ఉండగా.. ఇన్నింగ్స్ పదో ఓవర్లో వెయ్యి పరుగుల మార్క్ దాటాడు. అంతేకాక కేకేఆర్ జట్టుపై వెయ్యి పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. డేవిడ్ వార్నర్ (1093), రోహిత్ శర్మ (1070) విరాట్ కోహ్లీ కంటే ముందు ఈ ఘనత సాధించారు. ఇంతకముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లపై కోహ్లీ వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
WHAT A SHOT BY VIRAT KOHLI. 👌 pic.twitter.com/4DGHdcWd5f
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
ఐపీఎల్ లో వివిధ టీంలపై వెయ్యికిపైగా రన్స్ చేసిన బ్యాటర్లు ..
♦ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో నాలుగు జట్లపై (CSK, DC, KKR, PBKS) వెయ్యికిపైగా రన్స్ చేశాడు.
♦ డేవిడ్ వార్నర్ రెండు జట్లపై (KKR, PBKS) వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
♦ రోహిత్ శర్మ రెండు జట్లపై (KKR, DC) వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
♦ శిఖర్ ధావన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై వెయ్యికిపైగా పరుగులు చేశాడు.
THE KING KOHLI SHOW AT THE EDEN GARDENS. 🔥🔥🔥pic.twitter.com/29ze3RCpiE
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025