Ayush Mhatre : గేజ్ టెస్టులో విఫలమైన బ్యాట్‌తోనే విధ్వంసం సృష్టించిన ఆయుష్ మాత్రే.. అంపైర్ అలాఎలా ఆడనిచ్చాడంటే?
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు ఆయుష్ మాత్రేకు (Ayush Mhatre) అనూహ్య ఘటన ఎదురైంది.
IPL 2026 CSK vs PBKS Ayush Mhatre Fails Bat Test Twice Due To Umpire Error (pic credit@ipl)
- గేజ్ టెస్టులో విఫలమైన ఆయుష్ మాత్రే రెండు బ్యాట్లు
- అయినాగానీ మొదట విఫలమైన బ్యాట్‌తోనే ఆడిన మాత్రే
Ayush Mhatre : శుక్రవారం చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినప్పటికి కూడా సీఎస్కే యువ ఆటగాడు ఆయుష్ మాత్రే పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సికర్ల సాయంతో 73 పరుగులు చేసి సీఎస్కేకు భారీ స్కోరు అందించాడు. అతడి స్ట్రైక్‌రేటు స్ట్రైక్ రేట్ 169.77గా ఉంది.
గేజ్ టెస్టులో రెండు బ్యాట్లు విఫలం..
ఆటగాళ్లు వాడే బ్యాట్లు నిర్దిష్ట ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఐపీఎల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటర్లు క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే గేజ్ అనే పరికరాన్ని ఉపయోగించి బ్యాట్లను పరీక్షిస్తారు. కాస్త గుండ్రంగా ఉండే ఈ పరికరం గుండా బ్యాట్ పూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బ్యాట్‌ను సదరు ఆటగాడు వాడొచ్చు. ఒకవేళ గేజ్ గుండా బ్యాట్ వెళ్లకపోతే సదరు బ్యాట్‌ను ఆటగాడు ఉపయోగించడానికి వీలులేదు.
Shreyas Iyer : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?
ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు ఆయుష్ మాత్రేకు అనూహ్య ఘటన ఎదురైంది. సంజూ శాంసన్ ఔట్ అయ్యాక వన్‌డౌన్‌లో ఆయుష్ మాత్రే క్రీజులోకి వచ్చాడు. నిబంధనల ప్రకారం అంపైర్ అతడి బ్యాట్‌ను గేజ్‌తో చెక్ చేశాడు. అయితే.. ఆ బ్యాట్ గేజ్ గుండా వెళ్లలేదు. వెంటనే అతడు మరో బ్యాట్‌ను తెప్పించుకున్నాడు. ఆ బ్యాట్ కూడా గేజ్ గుండా వెళ్లలేదు.
అయినప్పటికి కూడా తొలుత అతడు తెచ్చుకున్న బ్యాట్‌తోనే ఆడేందుకు అంపైర్ అనుమతి ఇచ్చాడు. ఇందుకు ఓ ప్రధాన కారణం ఉంది. ఇక్కడ అంపైర్ పొరబాటు ఉంది. అంపైర్ గేజ్ పరికరాన్ని సరైన పద్దతిలో పట్టుకోలేదు. రివర్స్‌లో పట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయుష్ మాత్రే.. అంపైర్‌కు ఆ విషయాన్ని చెప్పగా సరైన పద్దతిలో పట్టుకుని చెక్ చేశాడు. అప్పుడు ఆయుష్ బ్యాట్ పరీక్షలో పాసైంది.
ఈ సంఘటనను చూసి నివ్వెరపోయిన కామెంటేటర్ ఇయాన్ బిషప్.. గేజ్ తల్లక్రిందులుగా ఉంది. అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
