Shreyas Iyer : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?
బ్యాటర్‌గానే కాకుండా తనదైన వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పంజాబ్ కింగ్స్ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు.
Punjab Kings captain Shreyas Iyer at risk of ban in IPL 2026
- శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు
- వరుసగా రెండు సార్లు స్లో ఓవర్రేటును నమోదు చేసిన పంజాబ్ కింగ్స్
- మూడోసారి కూడా ఇలాగే జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. బ్యాటర్‌గానే కాకుండా తనదైన వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మెడపై ఓ కత్తి వేలాడుతోంది. అదే గనుక జరిగితే ఐపీఎల్లో అతడి ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది
అసలేం జరిగిదంటే..?
శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేసింది. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇలా స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇది రెండోసారి. ఈ క్రమంలో ఐపీఎల్ నిర్వాహకులు శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించారు. రూ.24 లక్షల ఫైన్ వేశారు. అంతేకాదండోయ్.. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లు అందరి మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదంటే రూ.6లక్షలు.. ఈ రెండింటిలో ఏదీ తక్కువ అయితే దాన్ని జరిమానాగా విధించారు.
మూడోసారి ఇలాగే జరిగితే..
ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి కూడా పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ పై ఓ మ్యాచ్ నిషేదాన్ని విధిస్తారు. అంతేకాకుండా అతడికి 30లక్షల ఫైన్ వేయడంతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టు సభ్యులందరి మ్యాచ్‌ల్లో ఫీజుల్లో 50 శాతం లేదంటే తలా 12 లక్షలు.. రెండింటిలో ఏదీ తక్కువైతే అది జరిమానాగా విధిస్తారు.
అంటే ఇక పై శ్రేయస్ అయ్యర్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ అతడు ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొనాల్సి వస్తే అది పంజాబ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
