CSK vs SRH Head to Head: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే.. ఆధిపత్యం ఎవరిదంటే?
CSK vs SRH Preview: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం చెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs SRH) తలపడనుంది.
IPL 2026 CSK vs SRH head to head pitch report (pic credit@ipl)
CSK vs SRH : ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం చెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరువకావాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అందరి దృష్టి ఎంఎస్ ధోని పైనే ఉంది. ఈ సీజన్లో చెపాక్ మైదానంలో సీఎస్కే చివరి మ్యాచ్ ఇదే కావడంతో కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ధోని ఆడాతాడా? లేదా? అనేది ఆసక్తి కరంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఆడి రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వస్తున్నాయి.
MS Dhoni : ఐదేళ్ల క్రితం ధోని చెప్పిన మాట నేడు నిజం కాబోతుందా? రైనా కూడా వచ్చేశాడు..
సన్‌రైజర్స్ పరిస్థితి ఎలా ఉన్నా సరే.. సీఎస్కేకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు అవుతాయి.
పిచ్ ..
చెపాక్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ 210 పరుగులు సాధిస్తే గెలవవచ్చునని ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరోన్ సూచించారు. ఇక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇతి ఆతిథ్య జట్టుకు స్వల్ప ప్రయోజనాన్ని చేకూర్చవచ్చునని సీఎస్కే ఫాస్ట్ బౌలర్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.
హెడ్-టు-హెడ్..
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లు 23 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 8 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
తుది జట్ల అంచనా..
సీఎస్కే..
సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సర్ జాన్సన్
ఇంపాక్ట్ ప్లేయర్.. ముకేశ్ చౌదరి
ఎస్ఆర్హెచ్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, స్మరన్ రవిచంద్రన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, పాట్ కమిన్స్, శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, ప్రపుల్ హింగే
ఇంపాక్ట్ ప్లేయర్.. షకీబ్ హుస్సేన్
