MS Dhoni : ఐదేళ్ల క్రితం ధోని చెప్పిన మాట నేడు నిజం కాబోతుందా? రైనా కూడా వచ్చేశాడు..
అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
MS Dhoni To Retire In Chennai Tonight what he said in 5 years ago
- చెపాక్ వేదికగా నేడు చెన్నై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్
- ధోనికి ఇదే చివరి మ్యాచ్ కానుందా?
- రైనా రాకకు కారణం ఏంటి?
MS Dhoni : అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్లో గాయం కారణంగా ఇప్పటి వరకు ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చెన్నైలోని చెపాక్ వేదికగా నేడు (మే 18న) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కేకు ఇదే చివరి హోం మ్యాచ్. ఈ క్రమంలో అభిమానుల్లో భావోద్వేగం నెలకొంది. అదే సమయంలో ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై చర్చ మొదలైంది.
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనిపై హింట్ ఇచ్చాడు. సోమవారం చెపాక్‌లో చెన్నైఈ సీజన్లో చివరి హోమ్ మ్యాచ్ ఆడనుందని, ఈ మ్యాచ్‌లో సర్ప్రైజ్ను చూసే అవకాశం ఉందన్నాడు. అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసే నిర్ణయం వచ్చినా కూడా తనకేమీ సర్ప్రైజ్ కాదన్నాడు.
ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడు?
2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన సందర్భంలో ధోని మాట్లాడుతూ.. తాను చెపాక్‌లోనే తన చివరి టీ20 మ్యాచ్ ఆడతానని తెలిపాడు. ‘నా క్రికెట్ ప్రయాణంలో నేను ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా ఆడాను. నేను ఆడిన చివరి వన్డే మ్యాచ్ రాంచీ వేదికగానే జరిగింది. నా సొంత ఊరైన రాంచీలో చివరి వన్డే మ్యాచ్ ఆడాను. కాబట్టి నా చివరి టీ20 చెన్నైలోనే జరుగుతుందని ఆశిస్తున్నాను. అది వచ్చే ఏడాదా? మరో ఐదేళ్ల తరువాత అన్నది నాకు ఖచ్చితంగా తెలియదు.’ అని ధోని అన్నాడు.
View this post on Instagram
ప్రస్తుతం ధోని వయసు 44 ఏళ్లు. ఇప్పటికే గాయాలతో అతడు సతమతమవుతున్నాడు. వచ్చే ఏడాదికి అతడికి 45 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు అతడు ఫిట్‌గా ఉంటాడా? అన్నది సందేహమే. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఈనేపథ్యంలోనే నేడు చెపాక్ వేదికగా జరగనున్న సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ధోని ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడతాడా? లేదా పూర్తి స్థాయి మ్యాచ్ ఆడతాడా? అన్నది చూడాల్సిందే. మరోవైపు గత మూడు మ్యాచ్‌లుగా ధోని ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి కూడా జట్టు కూర్పును దెబ్బతీయవద్దు అనే అతడు ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి.
రైనా వచ్చేశాడు..?
ఇదిలా ఉంటే టీమ్ఇండియా మాజీ ఆటగాడు, ధోని స్నేహితుడు సురైనా రైనా చెన్నై చేరుకున్నాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత విదేశాల్లో సెటిల్ అయిన రైనా.. చెన్నైకి రావడంతో ధోనికి ఇదే చివరి మ్యాచ్ అనే ప్రచారానికి బలం చేకూరినట్లు అవుతోంది.
View this post on Instagram
