IPL 2026: బెంగళూరు జోరుకి బ్రేక్.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే విజయం
కేఎల్ రాహుల్ (57), స్టబ్స్ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు.
IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. చివరికి ఢిల్లీనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 రన్స్ టార్గెట్ ను ఢిల్లీ జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
కేఎల్ రాహుల్ (57), స్టబ్స్ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరలో డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించాడు. రెండు సిక్సర్లు కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. ఈ సీజన్ లో బెంగళూరుకి ఇది రెండో పరాజయం. అటు ఢిల్లీకి మూడో విజయం. వరుసగా రెండు మ్యాచులు నెగ్గిన బెంగళూరు.. మూడో మ్యాచ్ లో ఓడిపోయింది.
