IPL 2026 : విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కు ప్రమోషన్.. కేకేఆర్ యాజమాన్యం కీలక నిర్ణయం..
IPL 2026 : కేకేఆర్ జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.
IPL 2026 KKR Vice Captain Rinku singh
- కేకేఆర్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం
- విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కు ప్రమోషన్
- వైస్ కెప్టెన్‌గా నియమించిన కేకేఆర్
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2026) ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ట్రోపీని గెలుచుకునేందుకు అన్ని జట్టు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల సభ్యులు ప్రాక్టీస్ సెషన్లో మునిగిపోయారు. తాజాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కీలక ప్లేయర్ రింకూ సింగ్‌కు ప్రమోషన్ కల్పించింది.
Also Read : RCB Sold : ఆర్సీబీని అమ్మేశారు.. భారీ ధరకు కొనుగోలు చేసిన బిర్లా-టైమ్స్ గ్రూప్.. ఎంత చెల్లించారంటే?
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. కేకేఆర్ జట్టుకు వెటరన్ ఓపెనర్ అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ తో జట్టులో కీలకమైన ఆటగాడిగా పేరుపొందిన రింకూ సింగ్‌కు కేకేఆర్ యాజమాన్యం వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రింకూకు దేశవాళీ క్రికెట్లో నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. రింకూ సింగ్ 2018లో కేకేఆర్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026
కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ఫ్రాంచైజీ తరపున రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇదిలాఉంటే.. కేకేఆర్ జట్టును గాయల బెడద వేధిస్తోంది. యువపేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసేందుకు కేకేఆర్ తమ ఫ్రీసీజన్ క్యాంప్‌లో ట్రయల్స్ నిర్వహిస్తోంది.
Captain. Vice-Captain. Sorted 😌💜 pic.twitter.com/reeySu1chL
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026
