IPL 2026 : ఐపీఎల్లో సంచలనం.. పంజాబ్ రికార్డ్ చేజింగ్
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోర్ చేసింది.
IPL 2026: ఐపీఎల్ 2026లో సంచలనం నమోదైంది. లీగ్ చరిత్రలోనే అత్యధిక టార్గెట్ ను పంజాబ్ చేజ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఫినిష్ చేసింది.
ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. మరో విజయాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని సైతం ఎంతో ఈజీగా, మంచి నీళ్లు తాగినంత సులువుగా చేజ్ చేసింది పంజాబ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. 265 పరుగుల టార్గెట్ ను సైతం పంజాబ్ అలవోకగా చేదించింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది.
పంబాబ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ప్రియాంశ్ ఆర్య (43), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (76) చెలరేగి ఆడారు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 36 బంతుల్లోనే 71 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకి అపురూపమైన విజయాన్ని అందించాడు శ్రేయస్ అయ్యార్.
అటు ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సెంచరీ వృధా అయ్యింది. భారీ శతకం బాదినా జట్టుకి ఓటమి తప్పలేదు. ఇక, ఈ సీజన్ లో పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన అన్ని మ్యాచులు గెలిచింది. పాయింట్ల టేబుల్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతోంది.
