Kyle Jamieson : ఆరడుగులు ఉన్నావ్.. 15 ఏళ్ల పిల్లాడితో ఏంటి అలా.. దడుచుకుంటే ఎవరిది బాధ్యత..
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తరువాత కైల్ జేమీసన్ (Kyle Jamieson) సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IPL 2026 RR vs DC Kyle Jamieson Celebrations viral after Vaibhav Sooryavanshi out
- వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన ఆరడుగుల ఢిల్లీ పేసర్
- ఆనందంలో కైల్ జేమీసన్ అతి సెలబ్రేషన్స్
Kyle Jamieson : ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితాన్ని పక్కన పెడితే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఢిల్లీ బౌలర్లను చితక్కొడతాడని అంతా భావించారు. అయితే.. 6.8 అడుగుల ఢిల్లీ పేసర్ కైల్ జేమిసన్ బుడ్డోడికి షాక్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఆడిన తొలి బంతికి ఫోర్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ రెండో బంతికే జేమిసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జేమీసన్ సంధించిన ఖచ్చితమైన యార్కర్ వైభవ్ బ్యాట్ లోపలి అంచుకు తగిలి నేరుగా స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో నాలుగు పరుగులకే వైభవ్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
An in-swinging yorker 😲🔥
🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊
Wait for the celebration 👀
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3
— IndianPremierLeague (@IPL) May 1, 2026
ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన ఆనందంలో కైల్ జేమీసన్ కాస్త అతిగా సంబరాలు చేసుకున్నాడు. వైభవ్ కు చాలా దగ్గరగా వెళ్లి అరుస్తూ, చప్పట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాటి చెట్లలా పెరగగానే సరిపోదని, చిన్న పిల్లాడితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
