SRH vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టులో పలు మార్పులు
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య (SRH vs DC) మ్యాచ్ జరుగుతోంది.
IPL 2026 SRH vs DC Delhi Capitals opt to bowl (pic credit@ipl)
SRH vs DC : హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. టాస్ విషయంలో అదృష్టం కలిసి వస్తోంది. అన్ని మ్యాచ్లు టాస్ గెలిచి ఉంటే ఇంకా బాగుండేది. నేను ఢిల్లీ తరపున 100 మ్యాచ్లు ఆడతానని అనుకోలేదు. ఈ రాత్రికి విజయంతో ముగుస్తుందని ఆశిస్తున్నాను. పరిస్థితిని బట్టి మాకు సమతుల్యమైన తుది జట్టు అవసరం. తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. అకిబ్ నబీ స్థానంలో నితీష్ రాణా జట్టులోకి వచ్చాడు. ‘అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
🚨 Toss 🚨@DelhiCapitals have won the toss and elected to bowl first against @SunRisers in Hyderabad.
Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC pic.twitter.com/9pr4fTL6of
— IndianPremierLeague (@IPL) April 21, 2026
‘నిర్ణయించడం కష్టం, కానీ ఇది అలాంటి వికెట్ అని నేను అనుకోవడం లేదు. తుది జట్టులో మార్పులు ఉన్నాయి. మధుశంక, హర్ష్ దూబేలు తిరిగి జట్టులోకి వచ్చారు. ప్రణాళికలను అమలు చేయడమే సరైన మార్గం. ప్రస్తుతం దృష్టి మొత్తం ఒక్కొ మ్యాచ్ పైనే ఉంది.’ అని ఇషాన్ కిషన్ అన్నాడు.
తుది జట్లు..
సన్రైజర్స్ హైదరాబాద్..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఈషాన్ మలింగ
ఢిల్లీ క్యాపిటల్స్..
పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్, లుంగి ఎంగిడి.
