IPL : ఐపీఎల్ ఆటగాళ్లకు చెల్లింపుల విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మ్యాచ్ ఆడకపోయినా..
ఐపీఎల్ వేలంలో ఒక్కొ క్రికెటర్ కోట్ల రూపాయలను సొంతం చేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం.

IPL Salary system explained here
ఐపీఎల్ వేలంలో ఒక్కొ క్రికెటర్ కోట్ల రూపాయలను సొంతం చేసుకోవడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. వీరందరికి చెల్లింపులు ఎలా చేస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. వేలంలో ఎంత రేటు ఖరారైందో ఆ మొత్తాన్నే ఒక ప్లేయర్‌కు ఆయా ఫ్రాంచైజీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఏమైనా పన్నులు వర్తించేవి ఉంటే వాటిని తీసివేసి చెల్లిస్తారు.
* వేలంలో ఎంత మొత్తానికి అయితే ఆటగాళ్లను కొనుగోలు చేస్తారో సదరు మొత్తాన్ని ఆ ప్లేయర్‌కే చెల్లిస్తారు. మిగిలిన వారితో అతడికి సంబంధం ఉండదు.
* ఉదాహరణకు ఒక ఆటగాడు రూ.10 కోట్లకు అమ్ముడుపోయాడనుకుంటే.. ఒక సీజన్ కోసం ఈ మొత్తాన్ని చెల్లించాలి. మూడేళ్ల కాంట్రాక్టుపై ఆటగాడిని కొనుగోలు చేస్తే.. ఒక్కొ సీజన్‌కు రూ.10 కోట్ల చొప్పున మూడు సీజన్లకు కలిపి ఆ ఆటగాడికి రూ.30 కోట్ల మొత్తం దక్కుతుంది.
IPL 2025 Auction : వెంకటేశ్ అయ్యర్‌కు జాక్ పాట్.. కళ్లు చెదిరే ధర..
* ఒక సీజన్ కు ఆటగాడు పూర్తిగా అందుబాటులో ఉంటే పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. ఎన్ని మ్యాచుల్లో ఆడాడన్న దానితో సంబంధం ఉండడు. సీజన్‌లో సదరు ప్లేయర్ ఎన్ని మ్యాచులు ఆడాలన్నది ఫ్రాంచైజీ ఇష్టం.
* ఒకవేళ ఆటగాడు ఏవైనా కారణాల వల్ల కొన్ని మ్యాచులే అందుబాటులో ఉన్నట్లయితే నిబంధనల మేరకు చెల్లింపులు చేస్తారు.
* సీజన్ ప్రారంభమయ్యే ముందు గాయం కారణంగా ఆటగాడు వైదొలిగితే ప్రాంఛైజీ అతడికి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.
* కాంట్రాక్టు గడువు తీరక ముందే ఆటగాడిని ఫ్రాంచైజీలు విడిచిపెడితే.. ఒప్పందం కాల వ్యవధి వరకు అతడికి పూర్తి చెల్లింపులు చేసి పంపించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆటగాడే స్వయంగా తనను విడుదల చేయాలని కోరితే ఫ్రాంచైజీలు అప్పటి వరకే చెల్లింపులు చేస్తాయి.
IPL 2025 Auction : అరెరె.. కేఎల్ రాహుల్‌కే ఎందుకిలా జరుగుతోంది ? ఆర్‌సీబీకి వెళ్తాడనుకుంటే..?
* మ్యాచుల సందర్భంగా ఆటగాళ్లు గాయపడితే చికిత్సకు అయ్యే పూర్తి వ్యయాన్ని ఫ్రాంచైజీలు భరించాల్సి ఉంటుంది.
* అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల జీతాలను ఒకేసారి చెల్లించవు. సదరు ఫ్రాంచైజీ వద్ద ఎంత నగదు అందుబాటులో ఉంది. స్పాన్సర్ షిప్ డబ్బు ఎలా వస్తుంది అనే దానిపై ఆటగాళ్ల జీతాల చెల్లింపు ఆధారపడి ఉంటుంది. అయితే.. కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల వేతనాన్ని విడుతల వారీగా కాకుండా మొత్తాన్ని ఒకే సారి చెల్లిస్తుంటాయి.
* కొన్ని ఫ్రాంచైజీలు.. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు 50 శాతం, సీజన్ చివరిలో మిగిలిన 50 శాతాన్ని చెల్లిస్తుంటాయి. కొన్నిప్రాంఛైజీలు అయితే సీజన్ ఆరంభానికి వారం ముందు 15 శాతం, సీజన్ మధ్యలో 65 శాతం, సీజన్ ముగిసిన తర్వాత 20 శాతం చొప్పున చెల్లిస్తుంటాయి.