IPL2022 GT VS KKR : గుజరాత్‌ను కట్టడి చేసిన కోల్‌కతా బౌలర్లు.. కేకేఆర్ టార్గెట్ 157

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 157..

Ipl2022 Gt Vs Kkr

IPL2022 GT VS KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 157 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీతో రాణించాడు. 49 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు.

IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ

కాగా, భారీ స్కోరు చేస్తుందని భావించిన గుజరాత్‌ను.. కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. స్వల్ప వ్యవధిలో వికెట్లను తీస్తూ గుజరాత్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (67) హాఫ్ సెంచరీ చేయగా.. డేవిడ్ మిల్లర్‌ (27), వృద్ధిమాన్‌ సాహా (25), రాహుల్ తెవాతియా (17) ఫర్వాలేదనిపించారు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ఆండ్రూ రస్సెల్‌ (1-0-5-4) అదరగొట్టాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (67) అర్ధశతకంతో దంచికొట్టాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్‌కతాకు 157 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్‌లో పాండ్యతో పాటు సాహా (25), మిల్లర్‌ (27) రాణించారు. మిగిలిన వారెవరూ పెద్దగా ఆడలేదు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ ఆఖర్లో ఒకేఒక్క ఓవర్‌ వేసి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టిమ్‌ సౌథీ 3, ఉమేశ్ యాదవ్‌, మావి చెరో వికెట్‌ తీశారు.

IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం

ఇంతకుముందు మ్యాచ్‌లో గాయం కారణంగా ఆడలేకపోయిన పాండ్య.. ఈ మ్యాచ్ లో మళ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ టాప్‌లోకి వెళ్లాలని చూస్తోంది. మరోవైపు కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది.

జట్ల వివరాలు..

గుజరాత్‌ టైటాన్స్ జట్టు : వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌గిల్‌, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), అభినవ్‌ మనోహర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, అల్‌జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, యశ్‌ దయాల్‌, మహ్మద్ షమీ.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్‌ నరైన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి.