IPL2022 LSG Vs KKR : రాణించిన డికాక్, దీపక్ హుడా.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..

లక్నో బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. డికాక్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో మూడు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీపక్‌ హుడా (41), కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (28), అయుష్‌ బదోని (15*), జాసన్ హోల్డర్ (13) రాణించారు.

IPL2022 LSG Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతాకు 177 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

లక్నో బ్యాటర్లలో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్ (50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. డికాక్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో మూడు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీపక్‌ హుడా (41), కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (28), అయుష్‌ బదోని (15*), జాసన్ హోల్డర్ (13) రాణించారు.

David Warner: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ, శివమ్‌ మావి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. కాగా, శివమ్‌ మావి వేసిన ఓవర్‌లో లక్నో బ్యాటర్లు ఐదు సిక్సర్లు బాదడం విశేషం. ఇందులో మూడు స్టొయినిస్‌ కొట్టగా.. మరో రెండు హోల్డర్‌ బ్యాట్‌ నుంచి వచ్చాయి.

IPL2022 LSG Vs KKR Kolkata Knight Riders Target 177

కాగా.. ఒక్క విజయం సాధిస్తే దాదాపు ప్లే ఆఫ్స్‌ బెర్తును లక్నో ఖరారు చేసుకుంటుంది. మరోవైపు కోల్‌కతాకు ప్రతి విజయమూ అవసరమే. ఈ మ్యాచ్ లో టాస్‌ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన లక్నో 7 విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో (14) రెండో స్థానంలో ఉంది. ఇక కోల్ కతా జట్టు 10 మ్యాచులు ఆడగా 4 విజయాలే నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా (8) ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. జట్ల బలాలను చూస్తే లక్నో సమష్ఠిగా రాణిస్తూ విజయాలను నమోదు చేస్తోంది. కోల్‌కతాలో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికీ ఓటములు ఆ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఈ మ్యాచ్ లో లక్నో జోరుకి కోల్‌కతా అడ్డుంటుందో లేదో చూడాలి.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆరోన్‌ ఫించ్‌, బాబా ఇంద్రజిత్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), నితీశ్‌ రానా, రింకు సింగ్, అనుకుల్ రాయ్, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్‌ మావి, హర్షిత్‌ రానా.

Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే

లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్‌ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్‌, మోహ్‌సిన్ ఖాన్‌.

ట్రెండింగ్ వార్తలు