IPL2022 LSG Vs RR : చెలరేగిన హెట్‌మైర్.. లక్నో టార్గెట్ 166

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్నోకి 166 పరుగుల..

IPL2022 LSG Vs RR : చెలరేగిన హెట్‌మైర్.. లక్నో టార్గెట్ 166

Ipl2022 Lsg Vs Rr

Updated On : April 10, 2022 / 11:52 PM IST

IPL2022 LSG Vs RR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లక్నోకి 166 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాటర్లలో బ్యాటర్లలో షిమ్రోన్‌ హెట్‌ మైర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో ఒక ఫోర్, 6 భారీ సిక్సులు ఉన్నాయి.

దేవ్‌దత్‌ పడిక్కల్‌ (29), కెప్టెన్ సంజూ శాంసన్‌ (13), జోస్‌ బట్లర్ (13) పరుగులు చేశారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (28) రిటైర్డ్‌ ఔట్‌గా మధ్యలోనే క్రీజు వీడాడు. వాండర్ డస్సెన్ (4), రియాన్‌ పరాగ్‌ (8) విఫలమయ్యారు. ట్రెంట్ బౌల్ట్‌ (2*) పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌, జేసన్‌ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అవేశ్ ఖాన్‌ ఓ వికెట్ తీశాడు.(IPL2022 LSG Vs RR)

166 పరుగల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో జట్టుకి ఆదిలోనే గట్టి షాక్ లు తగిలాయి. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్రిష్ణప్ప గౌతమ్ డకౌట్ అయ్యారు. రాజస్తాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు.

IPL 2022: ఐపీఎల్‌లో ప్రత్యేక ఘనత సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన లక్నో కెప్టెన్‌ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు లక్నో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో గెలుపొందగా.. రాజస్తాన్‌ జట్టు మూడింట్లో రెండు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టుది పైచేయి అవుతోందో చూడాలి.

తుది జట్ల వివరాలు..
రాజస్థాన్ : జోస్ బట్లర్, రస్సీ వాండర్‌ డస్సెన్‌, దేవ్‌దత్ పడిక్కల్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), షిమ్రోన్‌ హెట్‌ మైర్‌, రియాన్ పరాగ్‌, కుల్దీప్ సేన్‌, రవిచంద్రన్‌ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌

లక్నో : కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డి కాక్‌ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, దీపక్‌ హుడా, ఆయుష్‌ బదోని, కృనాల్ పాండ్య, జేసన్‌ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్‌, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌