IPL2022 MI Vs GT : ఆఖర్లో తడబడిన ముంబై.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే

టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి..(IPL2022 MI Vs GT)

Ipl2022 Mi Vs Gj

IPL2022 MI Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులే చేసింది. గుజరాత్ ముందు 178 పరుగుల మోస్తరు టార్గెట్ నిర్దేశించింది.

ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(45), కెప్టెన్ రోహిత్ శర్మ(43), టిమ్ డేవిడ్(44*), తిలక్ వర్మ(21) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోసెఫ్, ఫెర్గుసన్, ప్రదీస్ సాంగ్వాన్ తలో వికెట్ తీశారు. బ్యాటింగ్‌ ఆరంభంలో అదరగొట్టినా ఆఖర్లో ముంబై తడబడింది. ఫలితంగా 10 ఓవర్లకు 97/1 ఉన్న స్కోర్‌.. ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 177/6కే పరిమితమైంది.(IPL2022 MI Vs GT)

Delhi Capitals: గంటకు 157కిలోమీటర్ల వేగంతో బౌలింగ్.. IPL 2022 ఫాస్టెస్ట్ డెలివరీ ఇదే

ఇషాన్‌ కిషన్‌ (29 బంతుల్లో 45 పరుగులు..5 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్ శర్మ (28 బంతుల్లో 43 పరుగులు..5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. చివర్లో టిమ్‌ డేవిడ్ (21 బంతుల్లో 44 పరుగులు..2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌) దంచికొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (13), తిలక్‌ వర్మ (21), పొలార్డ్ (4) పరుగులు చేశారు.

స్వల్ప వ్యవధిలో ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. ప్రదీప్‌ సాంగ్వాన్‌ వేసిన 11వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (13) ఔటయ్యాడు. రషీద్‌ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ (45)ను 12వ ఓవర్‌లో అల్జరీ జోసెఫ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇషాన్‌ను కూడా రషీద్‌ఖాన్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. కీరన్‌ పొలార్డ్‌ (4) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. రషీద్‌ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.


ఈ లీగ్ లో పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ అట్టడగు స్థానంలో ఉంది. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో గుజరాత్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ఆడిన 10 మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే ఓడి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ని ఖాయం చేసుకుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై జట్టు ఈసారి ఆశించిన మేరకు రాణించడం లేదు. ఆడిన 9 మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

David Warner: క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్

ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్‌, డానియల్ సామ్స్‌, మురుగన్‌ అశ్విన్‌, కుమార్‌ కార్తికేయ, జస్ ప్రీత్ బుమ్రా, రిలె మెరిడిత్.

గుజరాత్ టైటాన్స్ జట్టు:
శుభమన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్‌, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్‌, అల్జరీ జోసెఫ్‌, ప్రదీప్‌ సాంగ్వాన్, ఫెర్గూసన్, మహ్మద్‌ షమీ.