Ipl2022 Pbks Vs Kkr
IPL2022 PBKS Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో కోల్ కతా ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 138 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
రసెల్ 31 బంతుల్లోనే 70 పరుగులు బాదాడు. అతడి స్కోర్ లో 8 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26) ఫర్వాలేదనిపించాడు. రహానె (12), వెంకటేశ్ అయ్యర్ (3), నితీశ్ రాణా (0) నిరాశ పరిచారు. సామ్ బిల్లింగ్స్ (24) నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓడీన్ స్మిత్, రబాడ చెరో వికెట్ తీశారు. టీ20 మెగా టోర్నీలో కోల్‌కతా కు ఇది రెండో విజయం.(IPL2022 PBKS Vs KKR)
IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. దూకుడుగా ఆడి భారీ స్కోరు సాధించే యత్నంలో పంజాబ్ వ్యూహం బెడిసికొట్టింది. దాంతో 18.2 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. బరిలో దిగిన ప్రతి బ్యాట్స్ మన్ బంతిని బౌండరీలు దాటించేందుకే ప్రాధాన్యత నిచ్చారు. దాంతో కోల్ కతా బౌలర్లకు వికెట్లు తీయడం తేలికైంది.
పంజాబ్ జట్టులో భానుక రాజపక్స 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజపక్స 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1), షారుఖ్ ఖాన్ (0) విఫలమయ్యారు. ధావన్ 16, లివింగ్ స్టన్ 19, రాజ్ బవా 11, హర్ ప్రీత్ బ్రార్ 14 పరుగులు చేశారు. ఆఖర్లో కగిసో రబాడా ధాటిగా ఆడడంతో పంజాబ్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. 16 బంతులాడిన రబాడా 4 ఫోర్లు, 1 సిక్స్ తో 25 పరుగులు చేశాడు. ఓడియన్ స్మిత్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
కోల్ కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్ లో నిప్పులు చెరుగుతున్న ఉమేశ్… మరోసారి అదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇక టిమ్ సౌథీ 2 వికెట్లు తీశాడు. శివమ్ మావి, నరైన్, రసెలో తలో వికెట్ తీశారు.
మరోవైపు ఐపీఎల్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.
IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ
‘టీ20 మెగా టోర్నీలో భాగంగా.. ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతించింది. అందుకు సంబంధించిన టికెట్లు ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మరింత మంది క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచును చూసే వెసులుబాటు దొరికింది’ అని ‘బుక్ మై షో’ నిర్వాహకులు తెలిపారు.
టీ20 మెగా టోర్నీ 15వ సీజన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ మహరాష్ట్రలోని వాంఖడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్, ఎంసీఏ మైదానాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా తొలుత 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా, ఏప్రిల్ 2 నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలను ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.