IPL2022 SRH Vs CSK : ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. చెన్నైకి నాలుగో పరాజయం

ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో హైదరాబాద్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

IPL2022 SRH Vs CSK : ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. చెన్నైకి నాలుగో పరాజయం

Ipl2022 Srh Vs Csk

Updated On : April 9, 2022 / 7:35 PM IST

IPL2022 SRH Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఎట్టకేలకు ఈ మెగా టోర్నీలో హైదరాబాద్ జట్టు గెలుపు బోణీ కొట్టింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రాణించడంతో చెన్నైపై 8 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 154 పరుగులే చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (35 బంతుల్లో 48 పరుగులు), అంబటి రాయుడు ( 27 బంతుల్లో 27 పరుగులు), కెప్టెన్ జడేజా ( 15 బంతుల్లో 23 పరుగులు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్ సన్, మార్ క్రమ్ తలో వికెట్ తీశారు.(IPL2022 SRH Vs CSK)

IPL 2022 : ఇలా ఆడితే ఎప్పటికీ సాధించలేవు.. రిషబ్ పంత్‌కు సెహ్వాగ్ వార్నింగ్..!

155 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 17.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించి చెన్నైకి షాక్‌ ఇచ్చింది. హైదరాబాద్ జట్టు 17.4 ఓవర్లలో 155 పరుగులు చేసింది. హైదరాబాద్ ఓపెనర్లు విలియమ్ సన్‌, అభిషేక్‌ శర్మ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా చెలరేగిపోయారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అభిషేక్ శర్మ 50 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. కేన్ విలియమ్ సన్ 40 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రాహుల్‌ త్రిపాఠి కూడా రాణించాడు. త్రిపాఠి 15 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చెన్నై బౌలర్లలో ముకేశ్‌ చౌదరి, బ్రావో చెరో వికెట్‌ పడగొట్టారు.

ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ఇంకా బోణీ కొట్టలేదు. సీఎస్కేకి ఇది వరుసగా నాలుగో పరాజయం. చెన్నై జట్టు వరుస పరాజయాలు ఫ్యాన్స్ ను బాధిస్తున్నాయి. తన ఐదో మ్యాచ్ లో అయినా.. ఛాంపియన్‌ చెన్నై పుంజుకుని విజయాల బాటలోకి వస్తుందో లేదో అని ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. ఇక గత సంవత్సరం అనుభవాల నుంచి ఏమాత్రం నేర్చుకోని హైదరాబాద్‌ కూడా వరుసగా రెండు మ్యాచులు ఓడింది. ముచ్చటగా మూడో మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టింది.

IPL 2022: కోహ్లీని అవుట్ చేసిన చాహల్.. ట్విట్టర్లో మీమ్స్ వెల్లువ

స్కోర్లు..
చెన్నై సూపర్ కింగ్స్..154/7(20 ఓవర్లు)
సన్ రైజర్స్ హైదరాబాద్..155/2 (17.4 ఓవర్లు)

తుది జట్ల వివరాలు :
హైదరాబాద్‌ : అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్‌సెన్, ఉమ్రాన్‌ మాలిక్, టి. నటరాజన్‌

చెన్నై : రాబిన్ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్‌ దూబే, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, క్రిస్‌ జోర్డాన్, మహేశ్ తీక్షణ, ముఖేష్‌ చౌదరి