IPL2022 SRH Vs DC : అరదగొట్టిన ఢిల్లీ.. హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి

హైదరాబాద్ తో పోరులో ఢిల్లీ అదరగొట్టింది. 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి..

Ipl2022 Srh Vs Dc

IPL2022 SRH Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ తో పోరులో ఢిల్లీ అదరగొట్టింది. 21 పరుగుల తేడాతో హైదరాబాద్ ని చిత్తు చేసింది. తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ ఆఖర్లో తడబడింది.

నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో నికోలస్ పూరన్‌ (62), మార్‌క్రమ్‌ (42), రాహుల్‌ త్రిపాఠి (22) తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు.

మిచెల్‌ మార్ష్‌, కుల్దీప్‌ యాదవ్‌, నార్జే చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్‌ (92*) దంచికొట్టాడు. ఈ సీజన్ లో హైదరాబాద్‌కు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.(IPL2022 SRH Vs DC)

MS Dhoni: “జడేజాను సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ చేయడం తప్పుడు నిర్ణయం”

టీ20 లీగ్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌ చేరుకోవడమే లక్ష్యంగా జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ జట్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే 10 మ్యాచులు ఆడింది. 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి 5వ స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది ఢిల్లీ.

IPL2022 SRH Vs DC Delhi Capitals Won By 21 Runs On Sunriser Hyderabad

ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ జ‌ట్టు…ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఢిల్లీ కేపిట‌ల్స్ బ్యాట‌ర్లు శివాలెత్తిపోయారు. ఢిల్లీ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ (92), రోమన్ పావెల్ వీరవిహారం చేశారు. వార్న‌ర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఏకంగా 92 ప‌రుగులు సాధించాడు.

సెంచ‌రీకి చేరువైన వార్న‌ర్ చివ‌రి బంతి దాకా క్రీజులోనే నిలిచాడు. ఇక వ‌రుస‌గా స‌త్తా చాటుతున్న రోమ‌న్ పావెల్ ఈ మ్యాచ్ లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 35 బంతుల్లోనే 67 ప‌రుగులు సాధించాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. వార్నర్, పావెల్ పరుగుల వరద పారించడంతో ఢిల్లీ 207 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

ఢిల్లీ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో హైద‌రాబాద్ బౌల‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. ఇటీవ‌లి మ్యాచ్‌లో స‌త్తా చాటుతూ విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్న హైద‌రబాద్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. మొత్తం 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన మాలిక్ ఏకంగా 52 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. త‌న స్పెల్‌లో మాలిక్ ఒక్క‌టంటే ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, సీన్ అబాట్‌, శ్రేయస్ గోపాల్‌లు త‌లో వికెట్ తీశారు.

Rishabh Pant: “రిషబ్ పంత్ ఒత్తిడిలోనూ ప్రశాంతంగానే ఉంటాడు”

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు:
డేవిడ్ వార్నర్‌, మన్‌దీప్‌ సింగ్‌, మిచెల్ మార్ష్‌, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్‌, రోమన్‌ పావెల్, రిపాల్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆన్రిచ్‌ నార్జ్‌.

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు:
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్‌ కుమార్‌, సీన్‌ అబాట్‌, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్.