IPL2022 SRH Vs RCB : నిప్పులు చెరిగిన హైదరాబాద్ బౌలర్లు.. అతితక్కువ స్కోర్‌కే బెంగళూరు ఆలౌట్
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు సంధించారు. దీంతో బెంగళూరు జట్టు 68 పరుగులకే కుప్పకూలింది.

Ipl2022 Srh Vs Rcb
IPL2022 SRH Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్ సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు చెలరేగారు. నిప్పులు చెరిగే బంతులు సంధించారు. బెంగళూరు బ్యాటర్లను హడలెత్తించారు.
దీంతో బెంగళూరు జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. 16.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. హైదరాబాద్ ముందు 69 పరుగుల స్వల్ప టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్ సెన్, నటరాజన్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. జగదీశా సుచిత్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.(IPL2022 SRH Vs RCB)
IPL2022 CSK VS MI : ధోనీ.. వాటే ఫినిష్.. ఉత్కంఠపోరులో చెన్నై విజయం.. ముంబైకి వరుసగా 7వ పరాజయం
ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్ బౌలర్ మార్కో మాన్‌సెన్ (3/25) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బెంగళూరు కుప్పకూలడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత నటరాజన్ (3/10) విజృంభించాడు. వీరితోపాటు సుచిత్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (1/13), భువనేశ్వర్ (1/8) చెలరేగడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ, అనుజ్ రావత్, దినేశ్ కార్తిక్ డకౌట్ కాగా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 12, ప్రభుదేశాయ్ 15, హసరంగ 8, షాహ్‌బాజ్ 7, డుప్లెసిస్ 5, హర్షల్ పటేల్ 4, హేజిల్‌వుడ్ 3*, సిరాజ్ 2 పరుగులు చేశారు. బెంగళూరు బ్యాటర్లలో మ్యాక్స్‌వెల్ (12), ప్రభుదేశాయ్ (15) తప్పితే ఎవరూ పది పరుగులు కూడా చేయలేదు. తక్కువ పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ సీజన్ లో బెంగళూరు జట్టు చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు.. అందులో ఒకరు టాప్ బ్యాటర్ గోల్డెన్ డక్ కాగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. డుప్లెసిస్ (5), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (0)ను ఒకే ఓవర్‌లో హైదరాబాద్ బౌలర్ మార్కో జాన్‌సెన్ ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. డుప్లెసిస్‌ను బౌల్డ్ చేయగా.. మిగతా ఇద్దరు మార్‌క్రమ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరారు.
IPL2022 RR Vs DC : ఉత్కంఠపోరులో రాజస్తాన్‌దే విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ
హైదరాబాద్, బెంగళూరు జట్లు.. ఈ సీజన్‌లో అనూహ్య విజయాలను నమోదు చేస్తున్నాయి. వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి ఔరా అనిపించిన హైదరాబాద్ ఒకవైపు.. కప్ సాధించడమే లక్ష్యంగా దూసుకొస్తున్న బెంగళూరు మరోవైపు. టాప్-4లో నిలవాలంటే ప్రతి మ్యాచూ కీలకమైన తరుణంలో విజయం ఎవరి వైపు ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్‌తో హైదరాబాద్ సగం లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకుంటుంది.
After a superlative bowling performance, #SRH will be back for their run-chase
Join us for all the action in a bit and follow the game here: https://t.co/f9ENkwNWAn#TATAIPL | #RCBvSRH | #IPL2022 pic.twitter.com/BPAQf5ZdLr
— IndianPremierLeague (@IPL) April 23, 2022
జట్ల వివరాలు:
సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జగదీషా సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, సిరాజ్.
Stellar bowling performance from #SRH as they bundle out #RCB for just 68
3 wickets for Jansen and 3 for T Natarajan who ended up with figures of 3/10 and he is our top performer for his economical bowling figures!
Follow the match: https://t.co/f9ENkwNWAn#TATAIPL | #RCBvSRH pic.twitter.com/UViVjaCFGi
— IndianPremierLeague (@IPL) April 23, 2022