IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్ విజయం

జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సారథ్యంలో భారత్ తొలి టీ20 గెలిచింది.

IRE vs IND: తొలి టీ20లో ఐర్లాండ్‌పై భారత్ విజయం

IRE vs IND

IRE vs IND T20: ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. 2 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 140 పరుగుల టార్గెట్ తో టీమిండియా బరిలోకి దిగగా.. 6.5 ఓవర్ వద్ద వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ను ఆపేశారు. ఎంతసేపటికీ వాన తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ (DLS) ప్రకారం అప్పటికే 2 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్ ను విన్నర్ గా అనౌన్స్ చేశారు అంపైర్లు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

ఐర్లాండ్‌లోని డబ్లిన్, మలాహిడ్‌లో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సారథ్యంలో భారత్ ఈ టీ20 ఆడింది. ఏడాది తర్వాత మైదానంలో మళ్లీ బుమ్రా అడుగుపెట్టాడు.

టీమిండియా టార్గెట్ 140 పరుగులు

టీమిండియా ముందు ఐర్లాండ్ 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 139 పరుగులు చేసింది. బారీ మెక్‌ కార్తీ 51 (నాటౌట్), కర్టిస్ కాంఫర్ 39 పరుగులు బాదారు. మిగతా బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరూ చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా, అర్ష్ దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టాడు.

మరో 2 వికెట్లు

ఐర్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. లోక్రాన్, హ్యారీ ఔట్ అయిన తర్వాత జార్జ్ (1), మార్క్ (16) ఔటయ్యారు. స్కోరు 12 ఓవర్లకు 62గా ఉంది.

4 వికెట్లు డౌన్
ఐర్లాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. లోక్రాన్ (11), హ్యారీ (9) కూడా వెనుదిరిగారు. 6 ఓవర్లకు స్కోరు 30గా ఉంది.

2 వికెట్లు

ఐర్లాండ్ 2 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయింది. ఆండ్రూ బల్బిర్నీ (4), లోర్కాన్ టక్కర్ (డకౌట్) ఆదిలోనే ఔటయ్యారు.

టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ

ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌ కార్తీ, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, బెన్ వైట్

Shreyas Iyer : శ్రేయ‌స్ అయ్య‌ర్‌.. నిజంగానే మ‌న‌సున్న మా రాజు.. వీడియో వైర‌ల్‌