CSK Retained Players : సీఎస్‌కే అట్టిపెట్టుకునే, వదిలివేసే ఆటగాళ్లు వీరేనా? లిస్టులో ఊహించని ప్లేయర్లు..!
తమ జట్టులో గణనీయమైన మార్పులు చేయాలని సీఎస్‌కే చూస్తున్నట్లు (CSK Retained Players) సమాచారం.
Is this Chennai Super Kings IPL 2026 Release And Retention List
CSK Retained Players : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంఛైజీలు సిద్ధం అవుతున్నాయి. ఈ సీజన్ కన్నా ముందు డిసెంబర్‌లో మినీ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ వేలానికి వదిలివేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించేందుకు నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ అన్న సంగతి తెలిసిందే.
మిగిలిన జట్ల సంగతి ఎలా ఉన్నా సరే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ జట్టులో గణనీయమైన మార్పులు చేయాలని సీఎస్‌కే చూస్తున్నట్లు సమాచారం.
వేలానికన్నా ముందు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్‌కేతో విడిపోయే అవకాశాం ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ట్రేడింగ్‌లో జడేజా ను ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకునేందుకు సీఎస్‌కే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. జడ్డూతో పాటు మరో ఆటగాడిని కూడా ఆర్ఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ జడేజాతో పాటు యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇవ్వాలని ఆర్ఆర్ కోరగా.. అందుకు సీఎస్‌కే నిరాకరించింది. జడేజాతో పాటు ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం దీనిపై చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయిన సీఎస్‌కే మినీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసి తమ బృందాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి. డేవాన్ కాన్వే, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లను వేలానికి విడుదల చేయాలని (CSK Retained Players) భావిస్తున్నట్లు సమాచారం.
Rishabh Pant : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో రిషబ్ పంత్..
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్ట్‌ను ఫ్రాంచైజీ సిద్ధం చేసిందని, నవంబర్ 15న అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు చెన్నై సూపర్ కింగ్స్ రిటైర్ చేసుకునే ఆటగాళ్లు ఎవరు, ఎవరికి బిగ్ షాక్ ఇవ్వనున్నారో చూద్దాం..
చెన్నై సూపర్ కింగ్స్..
అట్టిపెట్టుకునే ఆటగాళ్లు..
రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఎంఎస్ ధోని, శివమ్ దూబే, రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, కమలేష్ నాగర్‌కోటి, నాథన్ ఎల్లిస్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్దార్థ్, శ్రేయాస్ గోపాల్, ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్
Azam Khan : మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
వదిలివేసే ఆటగాళ్లు..
రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్, సామ్ కుర్రాన్, దీపక్ హుడా, రామకృష్ణ ఘోష్, గుర్జాపనీత్ సింగ్.
