Mike Tyson : దిగ్గజం మైక్ టైసన్‌కు షాక్.. తన కంటే 31 ఏళ్ల చిన్నోడి చేతిలో ఓటమి..
దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ప్రొపెషనల్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ కు షాక్ తగిలింది.

Jake Paul beats Mike Tyson by unanimous decision in Texas
Mike Tyson vs Jake Paul : దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ప్రొపెషనల్ రింగ్‌లోకి అడుగుపెట్టిన ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ కు షాక్ తగిలింది. టెక్సాస్ వేదికగా జరిగిన బిగ్ బౌట్‌లో టైసన్ ఓడిపోయాడు. యూ ట్యూబర్ జేక్ పాల్ చేతిలో 78-74 తేడాతో ఓటమి చవిచూశాడు. 58 ఏళ్ల టైసన్ తనకంటే 31 ఏళ్ల చిన్నావాడు అయిన జేక్ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు.
ఇక ఈ బౌట్ ప్రారంభానికి ముందు జేక్ చెంప పై టైసన్ కొట్టాడు. దీంతో మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తొలి రెండు రౌండర్లలో టైసన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే.. దాన్ని ఆఖరి వరకు కొనసాగించలేకపోయాడు. మూడో రౌండ్ నుంచి పుంజుకున్న జేక్ పాల్ చివరి వరకు అదే ఉత్సాహం ప్రదర్శించి విజేతగా నిలిచాడు.
మైక్ టైసన్, జేక్ పాల్ ల మధ్య 8 రౌండ్లు జరిగాయి. 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10 తేడాతో పాల్ గెలిచాడు. తొలి రెండు రౌండ్లలో టైసన్ గెలిచాడు. మిగిలిన ఆరింటిలో పాల్ విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన పాల్‌కు దాదాపు రూ.337 కోట్లు, టైసన్ రూ.168 కోట్లు పొందనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. కెవిన్ చేతిలో ఓటమి తరువాత 2005లో ప్రొఫెనల్ బాక్సింగ్‌కు టైసన్ గుడ్ బూ చెప్పాడు. అయితే.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మళ్లీ ఇప్పుడు టైసన్ ఈ బౌట్‌లో పాల్గొన్నాడు.