Jasprit Bumrah : టీ20ల్లో బూమ్రా 100 వికెట్ మీద రచ్చ రచ్చ.. సోషల్ మీడియా ఫ్యాన్స్ జేమ్స్ బాండ్ లా మారి..
టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించాడు.
Jasprit Bumrah 100th T20I Wicket umpire no ball controversy
Jasprit Bumrah : దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ 100 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ను ఔట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బుమ్రా (Jasprit Bumrah) వందో వికెట్ సాధించాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి డెవాల్డ్ బ్రెవిస్ షాట్ ఆడగా బంతి టాప్ ఎడ్జ్ తీసుకుంది. కవర్స్‌లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే.. బుమ్రా వేసిన ఈ బంతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఫ్రంట్ ఫుట్ నో బాల్ అని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tilak Varma : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ అరుదైన ఘనత..
వాస్తవానికి మ్యాచ్‌లోనే ఈ విషయం తెలుసుకునేందుకు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. రిప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ బుమ్రా షూలోని కొంత భాగం క్రీజు వెనుక ఉందని భావించడంతో ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు.
JASPRIT BUMRAH COMPLETES 100 T20I WICKETS. pic.twitter.com/wGnRGBYwvT
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 9, 2025
అయినప్పటికి కూడా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కెమెరా యాంగిల్ స్పష్టంగా లేదు. అందువల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బౌలర్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయం తీసుకుని ఉంటాడని కామెంటేటర్ మురళీ కార్తీక్ చెప్పాడు. అయితే.. మరో కామెంటేటర్ దీన్ని వ్యతిరేకించారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోని కెమెరా ద్వారా అది నో బాల్ అని స్పష్టంగా అర్థమవుతుందన్నాడు.
ఈ మ్యాచ్‌లో బ్రెవిస్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22 పరుగులు చేశాడు. కాగా.. దూకుడుగా ఆడుతున్న సమయంలో బ్రెవిస్ ఔట్ కావడంతో దక్షిణాఫ్రికాకు తీరని నష్టాన్ని చేకూర్చింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లోనే బుమ్రా 11వ ఓవర్‌లో కేశవ్ మహారాజ్ ను ఔట్ చేసి రెండో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Fair Ball or No Ball 👀 pic.twitter.com/tuBfajx8MI
— Richard Kettleborough (@RichKettle07) December 9, 2025
Dewald Brevis is not out 😭 it’s no ball pic.twitter.com/FYAEjimhOP
— Prakash (@definitelynot05) December 9, 2025
