ENG vs IND : గంభీర్, గిల్ అదిరిపోయే స్కెచ్..! బుమ్రా స్థానంలో ఊహించని ప్లేయర్.. !
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు అన్న సంగతి తెలిసిందే.

Jasprit Bumrah OUT Akashdeep IN for ENG vs IND 2nd test
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలెట్టింది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. జూన్ 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఎలాగైన విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడు అన్న సంగతి తెలిసిందే.
తొలి టెస్టు ఆడిన బుమ్రా.. రెండో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా ? అన్న దానిపై ప్రస్తుతానికి సందిగ్దత నెలకొలంది. తొలి టెస్టులో 44 ఓవర్లు వేయడంతో అతడికి రెండో టెస్టులో విశ్రాంతి ఇస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడి స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
Yashasvi Jaiswal : మనసు మార్చుకున్న యశస్వి జైస్వాల్.. ఇక ముంబైకే..
బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్ ఆడనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే అతడు ప్రాక్టీస్ సెషన్స్‌లలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సిరాజ్, ప్రసిద్ద్ కష్ణ లు సైతం చెమటోడ్చుతున్నారు. అయితే.. అర్ష్‌దీప్ సింగ్ పెద్దగా ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో అతడు రెండో టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడని తెలుస్తోంది.
ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడిన ఆకాశ్ దీప్ 15 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 3/83. చివరిసారి అతడు 2024లో ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఆడాడు.