Virat Kohli: విరాట్‌ను ఉద్దేశిస్తూ కెవిన్ పీటర్సన్ ట్వీట్.. కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్

విరాట్ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే విరాట్.. విధేయతను కొనలేరు అంటూ ఓ నెటిజన్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.

Virat Kohli: విరాట్‌ను ఉద్దేశిస్తూ కెవిన్ పీటర్సన్ ట్వీట్.. కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్

Kevin Pietersen and Virat Kohli

Updated On : May 23, 2023 / 10:35 AM IST

Kevin Pietersen Tweet: ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లీగ్ దశను దాటలేక పోయింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడిపోవటంతో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక పోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ వీరవిహారం చేశాడు. 61 బంతుల్లో 101 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో తన ఎనిమిదో సెంచరీ నమోదు చేసుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ తీరుతో ఆయన అభిమానులతో పాటు పలువురు మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీని ఉద్దేశిస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ పోస్టు చేశాడు.

Virat Kohli: లండ‌న్ విమానం ఎక్క‌నున్న కోహ్లి

కోహ్లి ఇక ఢిల్లీ తరపున ఆడే సమయం ఆసన్నమైంది అంటూ పీటర్సన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ జట్టును వదిలి కోహ్లీ తన సొంత ప్రదేశం అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాలని పీటర్సన్ సూచించాడు. పీటర్సన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీటర్సన్ ట్వీట్ కు కోహ్లీ అభిమానులు స్పందిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. కొందరు పీటర్సన్ ట్వీట్ ను తప్పుపడుతుండగా.. మరికొందరు పీటర్సన్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

 

https://twitter.com/KP24/status/1660501760006340608?cxt=HHwWgIC2obLjpIsuAAAA

 

విరాట్ అంటే ఆర్సీబీ.. ఆర్సీబీ అంటే విరాట్.. విదేయతను కొనలేరు అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్స్ లో విజయం సాధించలేక పోయినప్పటికీ కోహ్లీ ఆర్సీబీ ప్లేయరే అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. కోహ్లీ ఆర్సీబీని వీడినా ఢిల్లీ క్యాపిట్స్ కు ప్రాతినిధ్యం వహించడు.. ధోనీ టీం అయిన చెన్నై సూపర్ కిగ్స్ జట్టులోకి వెళ్తాడు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా పీటర్సన్ ట్వీట్‌కు నెటిజన్లు రీ ట్వీట్లతో స్పందించారు.

 

https://twitter.com/_FaridKhan/status/1660504966677823488?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1660504966677823488%7Ctwgr%5E9fb9a13fe1a91c8550586b15a4b06bb1aac14979%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fipl-2023%2Ftime-for-virat-to-make-the-move-to-kevin-pietersen-tweets-internet-reacts-4057137

https://twitter.com/3lok_cricketfan/status/1660504769641828353?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1660504769641828353%7Ctwgr%5E9fb9a13fe1a91c8550586b15a4b06bb1aac14979%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fipl-2023%2Ftime-for-virat-to-make-the-move-to-kevin-pietersen-tweets-internet-reacts-4057137

https://twitter.com/BluntIndianGal/status/1660504223514259461?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1660504223514259461%7Ctwgr%5E9fb9a13fe1a91c8550586b15a4b06bb1aac14979%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsports.ndtv.com%2Fipl-2023%2Ftime-for-virat-to-make-the-move-to-kevin-pietersen-tweets-internet-reacts-4057137