Kieron Pollard : ‘ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది చాలు.. ఇక ఆపండి’ : హార్దిక్ పాండ్య‌కు కీర‌న్‌ పొలార్డ్ మ‌ద్ద‌తు

సొంత మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో 20 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డంతో ముంబై ఇండియ్స‌న్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

Kieron Pollard : ‘ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది చాలు.. ఇక ఆపండి’ : హార్దిక్ పాండ్య‌కు కీర‌న్‌ పొలార్డ్ మ‌ద్ద‌తు

Kieron Pollard sick and tired of Hardik Pandya criticism after MI lose to CSK

Kieron Pollard – Hardik Pandya : సొంత మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో 20 ప‌రుగుల తేడాతో ఓడిపోవ‌డంతో ముంబై ఇండియ్స‌న్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డి కెప్టెన్సీని ట్రోల్స్ చేస్తున్నారు. బౌల‌ర్ల‌ను స‌రిగ్గా వినియోగించుకోలేద‌ని, స్ట్రాట‌జీలు స‌రిగ్గాలేవ‌ని ఆరోపణ‌లు చేస్తున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్ వీటిపై స్పందించాడు. పాండ్య‌కు అండ‌గా నిల‌బ‌డ్డాడు.

పాండ్య గొప్ప ఆల్‌రౌండ‌ర్ల‌లో ఒక‌డని కితాబు ఇచ్చాడు. ఇలాంటి స‌మ‌యంలో పాండ్య‌కు అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ఇలాంటి విమ‌ర్శ‌లు అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయ‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు. చిన్న‌చిన్న విష‌యాల‌ను అత‌డు కుంగిపోయే ర‌కం కాదు. జ‌ట్టుగా మేము అత‌డికి అండ‌గా ఉంటాము. క్రికెట్‌లో జ‌ట్టుగా రాణిస్తేనే విజ‌యాలు సాధ్యం అవుతాయని చెప్పుకొచ్చాడు.

Rohit Sharma : చెన్నైపై ఓట‌మి.. బాధ‌తో ఒంటరిగా డ్రెస్సింగ్ రూమ్‌కు రోహిత్ శ‌ర్మ‌..

పాండ్య త‌న నైపుణ్యాల‌ను పెంచుకునేందుకు నిరంతరం శ్ర‌మిస్తున్నాడు. అత‌డి పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను చూసి వ్య‌క్తిగ‌తంగా తాను విసిగిపోయాను అని పొలార్డ్ తెలిపాడు. ప్ర‌స్తుతం ముంబైకి ప్రాతినిధ్యం వ‌స్తున్న అత‌డు కొన్ని వారాల్లోనే టీమ్ఇండియాకు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో అత‌డు బాగా ఆడాల‌ని వారే కోరుకుంటార‌ని, అందుక‌నే ప్ర‌తిసారి ప్రోత్స‌హించేందుకు ప్రయ‌త్నించాల‌న్నాడు.

బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్ చేయ‌గ‌ల సత్తా పాండ్య‌కు ఉంది. త‌ప్ప‌కుండా జ‌ట్టుకు అత‌డు ఎక్స్ ఫ్యాక్ట‌ర్ అన‌డంలో త‌న‌కు ఎలాంటి సందేహాం లేద‌న్నాడు. రానున్న రోజుల్లో అత‌డికి ప్ర‌తి ఒక్క‌రు అండ‌గా ఉంటార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని పొలార్డ్ అన్నాడు.

RCB vs SRH Match Prediction : హ్యాట్రిక్ విజ‌యాల‌పై స‌న్‌రైజ‌ర్స్ క‌న్ను.. ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగ‌ళూరు ఔట్‌