సంజూ శాంసన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్.. ఎవరిది పైచేయి?

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌క‌తా నైట్ రైడర్స్ జట్లు ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో ముఖాముఖి తలపడనున్నాయి.

సంజూ శాంసన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్.. ఎవరిది పైచేయి?

KKR vs RR IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌క‌తా నైట్ రైడర్స్ జట్లు ఈరోజు ముఖాముఖి తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కేకేఆర్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తే కేకేఆర్ టాప్ పొజిషన్‌కు చేరుకుంటుంది.

రెండు జట్ల జోరు చూస్తుంటే ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు దూసుకెళ్లేట్టు కనబడుతున్నాయి. అయితే మిగతా మ్యాచుల్లో ఫలితాల ఆధారంగా ప్లేఆఫ్‌ రేసు ఉంటుంది. ఈ రెండు టీముల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల‌ ఫలితాలను బట్టి చూస్తే ఆర్ఆర్‌దే పైచేయిగా ఉంది. మూడు మ్యాచుల్లో ఆర్ఆర్‌ విజయం సాధించగా, రెండిటిలో కేకేఆర్ గెలిచింది. తాజా సీజన్ రెండు జట్లు మెరుగ్గానే ఆడుతున్నాయి.

సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత సీజన్ లో సత్తా చాటిన యశస్వి జైశాల్ ఈసారి నిరాశపరిచినప్పటికీ.. జోస్ బట్లర్, రియాన్ పరాగ్ కీలక సమయంలో ఫామ్‌లో రావడంతో ఆర్ఆర్‌కు ప్లస్‌గా మారింది. అటు సంజూ శాంసన్ కూడా స్థిరంగా రాణిస్తున్నాడు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, చహల్ అంచనాలకు తగినట్టు రాణిస్తున్నారు.

అటు కేకేఆర్ కూడా సమిష్టిగా రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా జట్టును మాత్రం విజయపథంలో నడిపించాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర వెచ్చించి దక్కించుకున్న పేసర్ మిచెల్ స్టార్క్ గత మ్యాచ్‌లో సత్తా చాటడంతో కేకేఆర్ పుల్ హ్యపీగా ఉంది. మిచెల్ స్టార్క్ ఇదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందే. సునీల్ నరైన్, రసెల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నారు.

Also Read: వరుస ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబీకి బిగ్ షాక్..

జట్ల అంచనాలు
రాజస్థాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బర్గర్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి