KKRvsRR: రాజస్థాన్ టార్గెట్ 176

KKRvsRR: రాజస్థాన్ టార్గెట్ 176

Updated On : April 25, 2019 / 4:21 PM IST

కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను రాజస్థాన్ తీవ్రంగా కట్టడి చేసింది. ఆరంభం నుంచి ఒత్తిడి తీసుకురావడంతో రాజస్థాన్‌కు 176 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లు పేలవ ఆరంభమే ఇన్నింగ్స్ తక్కువ  స్కోరు చేయడానికి ప్రధాన కారణం. వరుస వికెట్లు పడిపోతున్నా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్( 97; 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చక్కటి భాగస్వామ్యం అందించే ప్లేయర్లు లేకపోయినప్పటికీ మంచి స్కోరు సాధించాడు. 

క్రిస్ లిన్(0), శుభ్‌మాన్ గిల్(14), నితీశ్ రానా(21), సునీల్ నరైన్(11), ఆండ్రీ రస్సెల్(14), కార్లొస్ బ్రాత్‌వైట్(5), రింకూ సింగ్(3) పరుగులు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ అరుణ్(2), ఒషానె థామస్(1), జయదేవ్ ఉన్దక్త్(1) వికెట్లు తీయగలిగారు.