Asia Cup 2023 : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. పాక్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

ఆసియా క‌ప్ (Asia Cup )2023కి ముందు భార‌త జ‌ట్టు(Team India)కు భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌లే గాయం నుంచి కోలుకుని జ‌ట్టులోకి వ‌చ్చిన స్టార్ ఆట‌గాడు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండానే జ‌ట్టుకు దూరం అయ్యాడు.

Asia Cup 2023 : టీమ్ఇండియాకు భారీ షాక్‌.. పాక్‌తో మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

Team India

Asia Cup : ఆసియా క‌ప్ (Asia Cup )2023కి ముందు భార‌త జ‌ట్టు(Team India)కు భారీ షాక్ త‌గిలింది. ఇటీవ‌లే గాయం నుంచి కోలుకుని జ‌ట్టులోకి వ‌చ్చిన స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ (KL Rahul) ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండానే జ‌ట్టుకు దూరం అయ్యాడు. అత‌డి గాయం మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డ‌మే అందుకు కార‌ణం. ఈ విష‌యాన్ని టీమ్ఇండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఆసియా క‌ప్‌లో టీమ్ఇండియా ఆడే మొద‌టి, రెండు మ్యాచ్‌ల‌కు (పాకిస్తాన్‌, నేపాల్‌) కేఎల్ రాహుల్ దూరంగా ఉంటాడ‌ని చెప్పాడు.

Rohit Sharma : రూమ్‌లో కూర్చోని బాధ‌ప‌డుతుంటే.. యువ‌రాజ్ చేసిన ప‌నిని మ‌రిచిపోలేను

ఆసియా క‌ప్‌లో పాల్గొనేందుకు భార‌త జ‌ట్టు ఈ రోజు కొలొంబోకు బ‌య‌లుదేరింది. అంత‌క‌ముందు నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. గ‌త వారం రోజుల నుంచి జ‌ట్టుతో పాటు కేఎల్ రాహుల్ తీవ్రంగా సాధ‌న చేశాడ‌ని, అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు ఆసియాక‌ప్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని చెప్పాడు. మ‌ళ్లీ రాహుల్ ఎన్‌సీఏలోనే ఉంటాడ‌ని, ఆసియా క‌ప్‌లో అత‌డు ఆడ‌డం పై సెప్టెంబ‌ర్ 4న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు చెప్పాడు. ఇదే విష‌యాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధికారికంగా ట్వీట్ చేసింది.

Asia Cup : స‌చిన్ రికార్డుపై కోహ్లి, రోహిత్ క‌న్ను.. మొద‌ట బ్రేక్ చేసేది ఎవ‌రో..?

ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆసియా క‌ప్ ప్రారంభం కానుంది. ఈ సారి హెబ్రిడ్ మోడ్‌లో ఈటోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 13 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నుండ‌గా శ్రీలంక 9, పాకిస్తాన్ 4 మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. 6 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని 2 గ్రూపులు విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భార‌త్‌, పాకిస్తాన్‌తో పాటు నేపాల్ ఉండ‌గా.. గ్రూప్‌-బిలో శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. గ్రూపులో ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. ఆయా గ్రూపుల్లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ 4 ద‌శ‌కు చేరుకుంటాయి. అక్క‌డ ఒక్కొ జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో మ్యాచులు ఆడుతుంది. టాప్ -2గా ఉన్న జ‌ట్లు ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌తాయి. టీమ్ఇండియా విష‌యానికి వ‌స్తే.. త‌న తొలి మ్యాచ్‌ను దాయ‌ది పాకిస్తాన్‌తో సెప్టెంబ‌ర్ 2న త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు శ్రీలంక‌లోని ప‌ల్లెకెలె వేదిక కానుంది. ఆ త‌రువాత సెప్టెంబ‌ర్ 4న నేపాల్‌తో ఆడ‌నుంది.

ఆసియాక‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.
స్టాండ్‌ బై: సంజు శాంసన్‌.

Neeraj Chopra : నీర‌జ్ చోప్రా సాధించిన చారిత్రాత్మ‌క విజ‌యాలు ఇవే..!