T20 World Cup-2022: ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో కోహ్లీ నేర్పిస్తాడు: రిషబ్ పంత్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం వల్ల జట్టు సభ్యులు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని ఆడగలరని భారత ఆటగాడు రిషబ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం పాకిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ ఉపయోగపడుతుందని చెప్పాడు.

T20 World Cup-2022: ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో కోహ్లీ నేర్పిస్తాడు: రిషబ్ పంత్

Updated On : October 20, 2022 / 11:46 AM IST

T20 World Cup-2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం వల్ల జట్టు సభ్యులు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని ఆడగలరని భారత ఆటగాడు రిషబ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం పాకిస్థాన్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పటికీ ఉపయోగపడుతుందని చెప్పాడు.

చాలా అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్ తో కలిసి బ్యాటింగ్ చేస్తే ఎన్నో విషయాలు నేర్చుకుంటామని, ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో తెలుసుకుంటామని రిషబ్ పంత్ అన్నాడు. కాగా, పాకిస్థాన్ తో మ్యాచు గురించి రిషబ్ పంత్ స్పందిస్తూ.. పాక్ తో ఆడడం ఎప్పటికీ ప్రత్యేకమేనని అన్నాడు. ఎందుకంటే పాక్ తో మ్యాచ్ అంటేనే ప్రత్యేకంగా హైప్ ఉంటుందని చెప్పాడు.

ఆ మ్యాచు సమయంలో తమలోనే కాకుండా క్రికెట్ అభిమానుల్లో, అందరిలోనూ ఎన్నో భావోద్వేగాలు నిండుకుంటాయని రిషబ్ పంత్ అన్నాడు. జాతీయ గీతం పాడుతున్న సమయంలోనూ ప్రత్యేక వాతావరణం ఉంటుందని, తన రోమాలు నిక్కపొడుచుకుంటాయని చెప్పాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..