Virat Kohli fans : బాలీవుడ్ నటుడిపై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. ఇంతకి అతడు చేసిన తప్పేంటో తెలుసా?
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు.

Kohli fans bombard Arshad Warsi Instagram account with hate posts in mix up with GT bowler
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ స్టార్ ఆటగాడు ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా.. కోహ్లీ అభిమానులు ప్రస్తుతం ఓ బాలీవుడ్ నటుడిపై మండిపడుతున్నాడు. ‘నిన్ను వదిలేది లేదు.. చూసుకుందాం..’ అంటూ అతడికి వార్నింగ్ ఇస్తున్నారు.
ఇంతకి ఆ నటుడు ఎవరు అంటే అర్షద్ వార్సీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నటుడు. ఇంతకి అతడు చేసిన తప్పు ఏంటని అంటారా? అతడు ఏ తప్పు చేయలేదు. కోహ్లీ ఫ్యాన్స్ పొరబాటున అతడికి ధమ్కీ ఇస్తున్నారు.
Comment Section of Arshad Warsi
This fanbase is doomed fr. pic.twitter.com/ZHZfxOfbXX— Aditya (@Hurricanrana_27) April 2, 2025
అసలేం జరిగిందంటే..?
బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(7)ని గుజరాత్ పేసర్ అర్షద్ ఖాన్ ఔట్ చేశాడు. కోహ్లీ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. టైమింగ్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ప్రసిద్ద్ కృష్ణ క్యాచ్ పట్టుకోవడంతో కోహ్లీ ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
RCB vs GT : బెంగళూరు పై ధనాధన్ ఇన్నింగ్స్.. చాలా అవమానకరంగా అనిపించిందన్న జోస్ బట్లర్..
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో బెంగళూరు ఫ్యాన్స్ నిరాశచెందారు. తమ అభిమాన ఆటగాడైన కోహ్లీని ఔట్ చేసినందుకు గాను అర్షద్ ఖాన్‌ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. ఈ క్రమంలో అర్షద్ ఖాన్‌కు బదులుగా నటుడు అర్షద్ వార్సీకి ధమ్కీ ఇస్తున్నారు. కోహ్లీని ఎందుకు ఔట్ చేశావని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.