Virat Kohli : ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోటీ.. గెలిచేది ఎవరో..?
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Messi vs Kohli
Virat Kohli vs Lionel Messi : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్‌లో కోహ్లీ, ఫుట్‌బాల్‌లో మెస్సీలు దిగ్గజ ఆటగాళ్లు. వీరిద్దరు తమ తమ ఆటల్లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. తమ ఆటతో ప్రపంచ వ్యాప్తంగా వీరిద్దరు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాగా.. ఈ ఇద్దరూ ఇప్పుడు ఓ అవార్డు కోసం పోటీపడుతున్నారు. క్రీడారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైన ‘ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023’ అవార్డు కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.
ఒకరు పరుగుల వరద పారిస్తే మరొకరు గోల్స్ వర్షం కురిపించారు. క్రికెట్‌లో కోహ్లీ ఈ ఏడాది పరుగుల వరద పారించాడు. ఐపీఎల్‌లో వరుస శతకాలు చేశాడు. ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లలో సైతం సెంచరీలు బాదాడు.సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి వన్డేల్లో అత్యధిక సెంచరీలు రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 50 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
MS Dhoni : దుబాయ్‌లో ధోని విహారయాత్ర..! పిక్స్ వైరల్.. కృతిసనన్, నుపుర్ సనన్, సాక్షి ఇంకా..
అటు ఫుట్‌బాల్‌లో మెస్సీ గోల్స్ వర్షం కురిపించాడు. గతేడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలిపాడు. ప్రాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచకప్ అనంతరం పీఎస్‌జీ క్లబ్‌ను మెస్సీ వీడాడు. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌తో ఒప్పందం చేసుకుని మేజర్ సారగ్ లీగ్‌లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈ ఏడాది తన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మకమైన ‘బాలన్ డీ ఓర్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
దీంతో వీరిద్దరు అవార్డు రేసులో నిలిచారు. వాస్తవానికి ఈ ఏడాది అద్భుతంగా రాణించిన వివిధ క్రీడారంగాలకు చెందిన వందల మంది ఆటగాళ్లు ఈ అవార్డు కోసం పోటీ పడగా చివరకు వీరిద్దరే మిగిలారు. త్వరలో ఓటింగ్ ద్వారా వీరిద్దరిలో ఒకరు విజేతగా నిలవనున్నారు.
Virat Kohli Vs Lionel Messi Final for ‘Pubity Athlete of the Year’ award. pic.twitter.com/w4zm4MJmt3
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023