IND vs SA : భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముతున్న‌వ్య‌క్తి అరెస్ట్.. కోహ్లీ బ‌ర్త్ డే రోజునే..

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోని మ్యాచ్‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.

IND vs SA : భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముతున్న‌వ్య‌క్తి అరెస్ట్.. కోహ్లీ బ‌ర్త్ డే రోజునే..

Kolkata Man Arrested

Updated On : October 31, 2023 / 8:57 PM IST

India vs South Africa : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోని మ్యాచ్‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్‌లో ఉంది. ఆడిన ఆరు మ్యాచుల్లో విజ‌యాలు సాధించి దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో న‌వంబ‌ర్ 5 న ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది. ఓ వ్య‌క్తి ఈ మ్యాచ్ టికెట్ల‌ను బ్లాక్‌లో అమ్ముతుండ‌గా కోల్‌క‌తా పోలీసులు పట్టుకున్నారు. రూ.2500 విలువ గ‌ల టికెట్ల‌ను రూ.11000 ల‌కు అంకిత్ అగ‌ర్వాల్ అనే వ్య‌క్తి అమ్ముతుండ‌గా పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డి వ‌ద్ద నుంచి 20 టికెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ జ‌ర‌గ‌నున్న రోజుకు ఓ ప్ర‌త్యేక ఉంది. ఆ రోజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. 35వ ప‌డిలో అడుగుపెట్ట‌నున్న కోహ్లీ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ (క్యాబ్‌) ఏర్పాట్లు చేస్తోంది. మైదానంలో కోహ్లీ చేత పెద్ద కేక్‌ను క‌ట్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 70 వేల కోహ్లీ ఫేస్ మాస్క్‌లు అభిమానులు ధ‌రించేలా అందుబాటులో ఉంచ‌నుంది.

Pakistan cricketers : రుచుల‌ను ఆస్వాదిస్తున్న పాక్‌ఆట‌గాళ్లు.. ఏ బిర్యానీ బాగుంది..? హైద‌రాబాదా..? కోల్‌క‌తానా..?

అటు ఈ మెగాటోర్నీలో ద‌క్షిణాఫ్రికా సైతం రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్ పై అభిమానుల్లో ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. పైగా కోహ్లీ బ‌ర్త్ డే కావ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని చాలా మంది భావిస్తున్నారు. దీన్ని అవ‌కాశంగా తీసుకుని కొంద‌రు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు.

మీమ్స్ వైర‌ల్‌..

ఇలా బ్లాక్ లో టికెట్ల అమ్మ‌డాన్ని నెటీజ‌న్లు త‌ప్పుబ‌ట్టారు. అందుక‌నే స్టేడియాల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయ‌ని ఓ నెటీజ‌న్ అభిప్రాయ ప‌డ్డాడు. అత‌డికి అన్ని టికెట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని కామెంట్లు చేస్తున్నారు. కొంద‌రు మీమ్స్‌తో ఆడుకుంటున్నారు.

Pakistan : నాలుగో స్థానంలో నిలిచేందుకు పాకిస్థాన్‌కు అవ‌కాశం.. రెండు మ్యాచులు గెలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?