KXIPvsKKR: కోల్‌కతా కుమ్మేసింది, ప్లే ఆఫ్ ఆశలు సజీవం

పంజాబ్‌లోని మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది కోల్‌కతా. 7వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతాలో 12పాయింట్లు వేసుకుంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లే. శామ్ కరన్ (55 నాటౌట్: 24 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు), నికోలస్ పూరన్ (48: 27 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులు), మయాంక్ అగర్వాల్ (36: 26 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి మెప్పించారు.
184 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన కోల్‌కతా అనంతర ఛేదనలో క్రిస్‌లిన్ (46: 22 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులు) మెరుపులకి యువ ఓపెనర్ శుభమన్ గిల్ (65 నాటౌట్: 49 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సులు) అజేయ అర్ధశతకం తోడవడంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా 185/3తో విజయాన్ని అందుకుంది. మిడిల్ ఓవర్లలో రాబిన్ ఉతప్ప (22: 14 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు), ఆండ్రీ రసెల్ (24: 14 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైనా.. ఆఖర్లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ (21 నాటౌట్: 9 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు)తో విజయాన్ని అందుకున్నారు.
అంతకంటే ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(48) ఒక్కడే అధిక స్కోరుతో నిలిచాడు. వారియరర్(2), గర్నీ(1), రస్సెల్(1), నితీశ్ రానా(1)వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లు క్రిస్ గేల్(14), కేఎల్ రాహుల్(2)విఫలమైనప్పటికీ అగర్వాల్(36; 26బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సు), మన్దీదప్(25) కాసేపటి వరకూ వికెట్లు కాపాడుకోగలిగారు. మన్దీప్ అవుట్ అనంతరం బరిలోకి దిగిన నికోలస్ పూరన్(55; 24 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సులు)తో దూకుడుగా ఆడాడు. చివరి ఓవర్లలో స్వల్ప విరామంతోనే వికెట్లు కోల్పోవడంతో అశ్విన్(0), టై(0)మాత్రమే చేయగలిగారు.
That’s that from Mohali. The @KKRiders win by 7 wickets with 2 overs to spare ??#KXIPvKKR pic.twitter.com/2UMbc9tau6
— IndianPremierLeague (@IPL) May 3, 2019