Diogo Jota : తీవ్ర విషాదం.. పెళ్లైన 10 రోజులకే లివర్‌పూల్ స్టార్ డియోగో జోటా దుర్మరణం..
ఫుట్‌బాల్ ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది.

Liverpool Star Footballer Diogo Jota Dies In Car Crash
ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లివర్‌పూల్ స్టార్ ఫుట్‌బాలర్ డయోగో జోటా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన సోదరుడు ఆండ్రీతో కలిసి పోర్చుగీస్‌కు చెందిన డయోగో స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్ లో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి గురైన వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. మంటలు చెలరేడంతో ఇద్దరు కూడా సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. కాగా.. డయాగో సోదరుడు ఆండ్రీ కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే. ఈ ఇద్దరి ఫుట్‌బాల్ ఆటగాళ్ల మరణవార్తను తెలుసుకున్న అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
BBL 15 : బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే..
కాగా.. 28 ఏళ్ల డయోగో జోటా పది రోజుల క్రితమే వివాహబంధంలోకి అడుగుపెట్టాడు.. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి రూటే కార్డెసోను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 10 రోజుల్లోనే అతడు మృత్యువాత పడడం గమనార్హం.