IPL 2023, LSG vs CSK: వ‌రుణుడిదే ఆట‌.. ల‌క్నో, చెన్నై మ్యాచ్ ర‌ద్దు.. చెరో పాయింట్‌

చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో జెయింట్స్ ల మ‌ధ్య మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. వ‌ర్షం త‌గ్గిన‌ప్ప‌టికి మ్యాచ్‌ను నిర్వ‌హించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

LSG vs CSK (pic ipl)

IPL 2023, LSG vs CSK: చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో జెయింట్స్ ల మ‌ధ్య మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. ల‌క్నో ఇన్నింగ్స్ ముగియ‌డానికి మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉన్నాయి అన‌గా వ‌ర్షం మొద‌లైంది. చాలా సేప‌టికి త‌రువాత వ‌ర్షం త‌గ్గిన‌ప్ప‌టికి మ్యాచ్‌ను నిర్వ‌హించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించే అవ‌కాశం కూడా లేదు. ఎందుకంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇరు జ‌ట్లు క‌నీసం ఐదు ఓవ‌ర్లు అయినా ఆడితేనే ఈ ప‌ద్దతిని ఉప‌యోగించే ఆస్కారం ఉంది. చెన్నై క‌నీసం ఒక్క బంతి కూడా ఆడ‌లేదు.

IPL 2023, LSG vs CSK: మ్యాచ్ ర‌ద్దు.. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో జ‌ట్టు 44 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అయితే ల‌క్నోను ఆయుష్ బ‌దోని (59 నాటౌట్) ఆదుకున్నాడు. నికోల‌స్ పూర‌న్‌(20) ఫ‌ర్వాలేద‌నిపించాడు. 19.2 ఓవ‌ర్ల వ‌ద్ద మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. అప్ప‌టికి ల‌క్నో 7 వికెట్ల న‌ష్టానికి 125 ప‌రుగులు చేసింది. చెన్నై బౌల‌ర్ల‌లో మొయిన్ అలీ, మ‌హేశ్ తీక్ష‌ణ‌, మ‌తీశా ప‌తిర‌ణ త‌లా రెండు వికెట్లు తీయ‌గా ర‌వీంద్ర జేడేజా ఓ వికెట్ తీశాడు.

వ‌ర్షం త‌గ్గిన‌ప్ప‌టికి మ్యాచ్‌ను నిర్వ‌హించే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ర‌ద్దు చేశారు అంపైర్లు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఈ సీజ‌న్‌లో వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దైన తొలి మ్యాచ్ ఇదే.

IPL 2023: అక్ష‌ర్ ప‌టేల్ పై ఆరోన్ ఫించ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు