MS Dhoni: శుభవార్త.. ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni ) తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital )లో గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది.

MS Dhoni knee surgery
MS Dhoni knee surgery: టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni ) తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి(Kokilaben Hospital )లో గురువారం(జూన్ 1న) ఉదయం నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్(Kasi Viswanathan) ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. మరో రెండు రోజులు మహేంద్రుడు ఆసుపత్రిలోనే ఉండనున్నాడు. ఆ తరువాత డిశ్చార్జి కానున్నాడు.
శస్త్రచికిత్స అనంతరం ధోనీతో మాట్లాడినట్లు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. ‘ఆపరేషన్ తర్వాత నేను అతనితో మాట్లాడాను. శస్త్రచికిత్స గురించి నేను వివరించలేను కానీ అది కీ-హోల్ సర్జరీ అని మాత్రం చెప్పగలను. అతను బాగానే ఉన్నాడు.’ అని విశ్వానాథన్ తెలిపారు.
IPL2023 Final: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై చెన్నై విజయం.. కప్పు ధోని సేనదే
రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలానే ధోనికి ఆపరేషన్ చేశారు. బుధవారం (మే 31) భార్య సాక్షితో కలిసి ధోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లాడు. కెప్టెన్ కూల్ చికిత్సను పర్యవేక్షించేందుకు సీఎస్‌కే జట్టు వైద్యుడు డాక్టర్ మధు తొట్టప్పిల్ కూడా ముంబై చేరుకున్నారు. అయితే.. ధోని పూర్తిగా కోలుకునేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందనేది ఇంకా తెలియరాలేదు. అయితే అతడు రానున్న రెండు నెలల్లో పూర్తి ఫిట్‌గా మారే అవకాశం ఉంది.
కాగా.. ఇటీవల అహ్మబాదాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-16 సీజన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన రోహిత్ శర్మ రికార్డును ధోని సమం చేశాడు. ఇక ఈ సీజన్ మొత్తం ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడ్డాడు. వికెట్ల మధ్య పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డాడు. అందుకనే దాదాపు ఆఖరి రెండు ఓవర్లలోనే బ్యాటింగ్ వచ్చి భారీ షాట్లు మాత్రమే ఆడాడు.
రిటైర్మెంట్‌పై వార్తలు వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘రిటర్మెంట్ ను ప్రకటించడానికి ఇది సరైన సమయం. అయితే ఈ సంవత్సరం నేను ఎక్కడికి వెళ్లినా అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు అని చెప్పడం నాకు చాలా సులభం అయితే.. కష్టమైన విషయం ఏమిటంటే.. మరో 9 నెలలు కష్టపడి రావడమే. తిరిగి వచ్చి కనీసం ఇంకో సీజన్ అయినా ఆడతా. అయితే అది ఇప్పుడే చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. రానున్న ఎనిమిది, తొమ్మిది నెలల్లో నా శరీరం స్పందించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.’ అని ధోని అన్నాడు.