IPL 2021 : ధోనీ కొత్త లుక్..అదిరిందంటున్న అంటున్న నెటిజన్లు

'IPLకు ముందు ధోనీ కొత్తదనాన్ని పొందారు..అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది. వేచి ఉండండి' క్యాప్షన్ జత చేసింది. ఇందులో ధోనీ స్పాంకీ లుక్ లో కనిపిస్తున్నారు

IPL 2021 : ధోనీ కొత్త లుక్..అదిరిందంటున్న అంటున్న నెటిజన్లు

Dhoni

Updated On : August 20, 2021 / 10:17 AM IST

Mahendra Singh Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోనీ…స్టయిలిష్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అతని హెయిర్ స్టైల్ ను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. వెరైటీ లుక్ తో కనిపించే ధోనీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. తొలుత పొడవాటి జుట్టుతో కనిపించిన ధోనీ..తర్వాత స్టయిల్ మారుస్తూ వచ్చారు. యూత్ ఆయన స్టైల్ కు ఫిదా అయిపోతుంటారు. ధోనీ కటింగ్ చేయాలంటూ చెబుతుంటారు.

Read More : YSRTP : షర్మిల పార్టీకి.. రాజీనామా చేసిన ఇందిరాశోభన్!

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయినా..కూడా స్టయిల్ విషయంలో నో..కాంప్రమైజ్ అంటున్నారు.
ఇటీవలే ‘ఫంకీ’ హెయిర్ తో కనిపించిన ధోనీ..ఇప్పుడు మరో కొత్త లుక్ తో ముందుకొచ్చాడు. IPL అధికారికంగా ప్రసారం చేసే..‘స్టార్ స్పోర్ట్’ ధోనీ న్యూ లుక్ కు సంబంధించిన ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది.

Read More :Hotstar Plans: సెప్టెంబర్ 1 నుంచి అప్‌గ్రేడ్ అయ్యే Disney+Hotstar ప్లాన్లు ఇవే!

‘ఐపీఎల్ కు ముందు ధోనీ కొత్తదనాన్ని పొందారు..అసలైన సినిమా ఇంకా మిగిలే ఉంది. వేచి ఉండండి’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇందులో ధోనీ స్పాంకీ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోను చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. వెరైటీ లుక్ లో ఉన్న ధోనీ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Read More :Petrol Rate : తగ్గిన డీజిల్ ధర.. స్థిరంగా పెట్రోల్ ధర

ఐపీఎల్ 14 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ వేదికను యూఏఈకు మార్చారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మ్యాచ్ లు షురూ కానున్నాయి. ఇందుకోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్ జట్టులోని వాళ్లు..ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు.