Sri Lanka : పాక్, జింబాబ్వేతో ట్రై సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్.. ఒకటి కాదు రెండు..
శ్రీలంక (Sri Lanka) జట్టుకు రెండు భారీ షాక్‌లు తగిలాయి.
Major blow for Sri Lanka Ahead of tri series
Sri Lanka : నేటి (మంగళవారం, నవంబర్ 18) నుంచి పాకిస్తాన్, శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య ట్రై సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక (Sri Lanka) జట్టుకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. లంక జట్టు కెప్టెన్ చరిత్ అసలంకతో పాటు స్టార్ పేసర్ అసిత ఫెర్నాండో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వీరిద్దరు ఈ ట్రై సిరీస్‌కు దూరం అయ్యారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
కెప్టెన్ చరిత్ అసలంక దూరం కావడంతో దసున్ షనక సారథ్యంలో శ్రీలంక బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ‘అసలంక, ఫెర్నాండోలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరు స్వదేశానికి తిరిగి రానున్నారు. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని వారిద్దరు కోలుకునేందుకు సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.’ అని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
IND vs SA : రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు..
Sri Lanka Tour of Pakistan 2025 #PAKvSL
▫️ Two Players Returning Home
Captain Charith Asalanka and fast bowler Asitha Fernando, both suffering from illness, will return home.
The two players will not take part in the upcoming tri-series featuring Sri Lanka, Pakistan, and… pic.twitter.com/71Z3RVQPQW— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 17, 2025
ఈ ట్రై సిరీస్‌లో శ్రీలంక జట్టు తమ తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న ఆడనుంది. రావల్పిండి వేదికగా జింబాబ్వేతో తలపడనుంది.
SRH : ఐపీఎల్ 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు? క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం..
ట్రై సిరీస్‌కు నవీకరించిన శ్రీలంక జట్టు ఇదే..
ధసున్ షనక (కెప్టెన్) పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, పవన్ రత్నాయ.
