మనూ-సౌరవ్‌లు స్వర్ణాన్ని షూట్ చేశారు

భారత టీనేజ్ షూటర్లు మనూ బాకర్, సౌరవ్ చౌదరీలు మరోసారి స్వర్ణాన్ని గెలుచుకున్నారు. తైవాన్‌లోని తైపాయ్ వేదికగా జరిగిన 12వ ఆసియా ఎయిర్ గన్ చాంపియన్ షిప్‌లో మనూ-సౌరవ్‌ల జోడీ స్వర్ణాన్ని సాధించింది. గతేడాది ఢిల్లీ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ పోటీలో స్వర్ణాన్ని సాధించి వరుసగా మరో స్వర్ణాన్ని దక్కించుకున్నారు.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో 17ఏళ్ల మనూ, 16 ఏళ్ల సౌరబ్‌లు 784పాయింట్ల స్కోరు సాధించారు. ఈ స్కోరుతో యూరోపియన్ చాంపియన్ షిప్‌లో రష్యా విటాలినా బాట్సరాష్కినా, ఆర్టెమ్ చెర్నౌసోవ్‌ల జోడీ క్రియేట్ చేసిన రికార్డును అధిగమించారు.
మరో భారత జట్టు అయిన అనురాధ, అభిషేక్ వర్మలు ఫైనల్ చేరేందుకు సిద్ధమైయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) స్టేట్‌మెంట్ ద్వారా ఖరారు చేసింది.
Read Also : వార్నర్‌పై విలియమ్సన్ ఎరుపు దాడి