RR vs MI : రాజ‌స్థాన్‌తో కీల‌క మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

RR vs MI : రాజ‌స్థాన్‌తో కీల‌క మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..

Courtesy BCCI

Updated On : May 1, 2025 / 12:31 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఆరంభంలో వ‌రుస ఓట‌ముల‌తో ఇబ్బంది ప‌డ్డ ముంబై ఇండియ‌న్స్ ఆత‌రువాత బ‌లంగా పుంజుకుంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకువ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై 10 మ్యాచ్‌లు ఆడ‌గా 6 విజ‌యాలు సాధించింది. 12 పాయిట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ +0.889 గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. కాగా.. నేడు (మే 1) జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ముంబై త‌ల‌ప‌డ‌నుంది.

ఈ కీల‌క మ్యాచ్‌కు ముంబై ఇండియ‌న్స్‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు యువ స్పిన్న‌ర్ విఘ్నేష్ పుత్తూర్ గాయం కార‌ణంగా ఈ సీజ‌న్‌లోని మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని ముంబై ఇండియ‌న్స్ సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

CSK vs PBKS : ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్‌.. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు బీసీసీఐ భారీ జ‌రిమానా..

అత‌డు ముంబై జ‌ట్టులో అంత‌ర్భాగం అని, అత‌డు త్వ‌ర‌గా కోలుకుని బలంగా తిరిగిరావాల‌ని రాసుకొచ్చింది. అత‌డి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లుగా వెల్ల‌డించింది.

CSK vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో చెన్నై ఆట‌గాడి వివాదం..! సైగ‌లు చేస్తూ.. వీడియో వైర‌ల్‌..

ముంబై ఇండియన్స్ మెడికల్, స్ట్రెంగ్త్ & కండిషనింగ్ బృందం మార్గదర్శకత్వంలో విఘ్నేష్ కోలుకోవ‌డం దృష్టిపెట్టాడ‌ని, అత‌డు ఫ్రాంచైజీతోనే ఉంటాడని జట్టు పేర్కొంది.

ఇక ర‌ఘు శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. అత‌డు దేశ‌వాళీ క్రికెట్‌లో పంజాబ్‌, పాండిచ్చేరి త‌రుపున ఆడాడు. 11 ఫ‌స్ట్ కాస్ల్ మ్యాచ్‌ల్లో 19.59 స‌గ‌టుతో 57 వికెట్లు తీశాడు. 9 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు సాధించాడు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2024-25 విజ‌య్ హ‌జారే ట్రోఫీలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ శ‌త‌కంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డిందే.. ఇప్పుడెలా?

ర‌ఘు శ‌ర్మను రూ.30ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో ముంబై తీసుకుంది.