Shreyasi Singh : నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్ర‌మాణం చేసిన శ్రేయసి సింగ్ ఎవ‌రు?

బిహార్‌ సీఎంగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ (Shreyasi Singh) అందరి దృష్టిని ఆకర్షించారు.

Shreyasi Singh : నితీశ్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్ర‌మాణం చేసిన శ్రేయసి సింగ్ ఎవ‌రు?

Meet Shreyasi Singh ace shooter and a gold medalist now part of Bihar Nitish government

Updated On : November 20, 2025 / 4:48 PM IST

Shreyasi Singh : బిహార్‌లో మ‌రోసారి ఎన్డీయే ప్ర‌భుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర సీఎంగా ప‌దోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ త‌రువాత ప‌లువురు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. అయితే.. వీరంద‌రిలో శ్రేయ‌సి సింగ్ మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

శ్రేయ‌సి సింగ్ ఎవ‌రంటే..?

1991 ఆగ‌స్టు 29న బిహార్‌లోని గిడౌర్ గ్రామంలో జ‌న్మించింది శ్రేయ‌సి సింగ్. షూటర్‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై భారత జెండాను రెప‌రెప‌లాడించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజత పతకం, 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణ పత‌కాన్ని సాధించింది. 2014 ఆసియా క్రీడ‌ల్లో టీమ్ ఈవెంట్‌లో కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. ఆమె చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.

Priyank Panchal : నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్‌.. మామూలు విధ్వంసం కాదు భ‌య్యా..

శ్రేయ‌సి సింగ్ మ‌రెవ‌రో కాదు కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురే. అంతేకాదండోయ్‌.. ఈమె తాత సెరేందర్‌సింగ్, తండ్రి దిగ్విజయ్‌ సింగ్‌ ఇద్దరూ ‘నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’కు అధ్యక్షులుగా పనిచేశారు. తల్లి పుతుల్‌ కుమారి మాజీ ఎంపీ.

2020లో శ్రేయ‌సి సింగ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆ వెంట‌నే జముయీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఇక‌ బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు 2025లో ఆర్జేడీ అభ్యర్థి షంషాద్‌ను ఓడించి 1,23,868 ఓట్లతో గెలుపొందారు.

Mohammed Shami : భార‌త జ‌ట్టులోకి నో ఛాన్స్‌.. ష‌మీ కీల‌క నిర్ణ‌యం..!