ఈ స్టార్ క్రికెటరే కాదు.. ఇతడి భార్య కూడా సూపర్ టాలెంటెడ్.. ఏం చేస్తోందంటే?
అంతకుముందు చాలాకాలం పాటు వారిద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆమె తమిళనాడులోని వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివింది. గోల్డ్ మెడల్ సాధించింది.

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ఐదవ టెస్ట్‌లో అద్భుతంగా రాణించి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. కెరీర్‌లో అతడు పలు సమస్యలను ఎదురుకుంటున్నప్పటికీ, అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఫుల్ హ్యాపీ. ఇందుకు కారణం అతడి తన భార్య రచనా కృష్ణ. ఆమె భర్తకు బాగా సపోర్ట్ ఇస్తుంది. ఆమె కేవలం స్టార్ క్రికెటర్ భార్యగానే కాకుండా, ఓ సక్సెస్‌ఫుల్ ఐటీ ప్రొఫెషనల్, ఎంటర్‌ప్రైనర్ కూడా.
రచనా కృష్ణ ఎవరు?
ప్రసిధ్ కృష్ణను కృష్ణ 2023 జూన్ 8న రచనా కృష్ణ దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంది. అంతకుముందు చాలాకాలం పాటు వారిద్దరు ప్రేమలో మునిగితేలారు. రచన తమిళనాడులోని వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివింది. గోల్డ్ మెడల్ సాధించింది.
Also Read: రూ.2.46 కోట్ల వాచ్ పెట్టుకుని వచ్చిన రోహిత్ శర్మ.. వీడియో చూస్తారా?
బిజ్టెక్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రొడక్ట్ విజన్ క్లబ్ గ్రాడ్యుయేట్ అడ్వైజర్‌గా క్వెస్ట్రం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో విద్యార్థి క్లబ్‌లకు కృష్ణ నాయకత్వం వహించింది. డెల్ టెక్నాలజీస్‌లో రచన ప్రొడక్ట్ మేనేజర్‌గా పని చేస్తోంది. డెల్‌లో చేరే ముందు ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేసింది. 2018లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆపరేషన్ మేనేజర్‌గా చేరింది. 2019 ఫిబ్రవరిలో ఆమెను ప్రొడక్ట్ మేనేజర్‌గా ప్రమోట్ చేశారు. 2020లో ఉద్యోగం నుంచి వైదొలిగి, టెక్సాస్ లోని ఆస్టిన్‌కు వెళ్లింది.
టెక్నాలజీ రంగంలో కెరీర్ కొనసాగిస్తూ, రచన తన సొంత ఎడ్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్థులను కార్పొరేట్ ప్రపంచంతో కలిపే ప్రయత్నం చేస్తోంది. ఆ స్టార్టప్ విద్యార్థులకు ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చి, స్వతంత్రంగా ఎదిగే నాలెడ్జ్‌ను అందిస్తోంది.