IND VS AUS : ఎన్నడూ లేనిది టీమ్ఇండియాను పొగిడిన మైఖేల్ వాన్.. మా జట్టుకు దిష్టిపెట్టకు అన్న జాఫర్..
టీమ్ఇండియా అంటే చాలు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ విద్వేషంతో రగిలిపోతాడు. ఎప్పుడు టీమ్ఇండియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.

Michael Vaughan-Wasim Jaffer
India vs Australia : టీమ్ఇండియా అంటే చాలు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ (Michael Vaughan) విద్వేషంతో రగిలిపోతాడు. ఎప్పుడు టీమ్ఇండియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. వాటికి టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) దిమ్మతిరిగే కౌంటర్లతో సమాధానాలు ఇస్తుండడాన్ని చూస్తూనే ఉంటాం. వీరిద్దరి ట్వీట్ల వార్‌ను అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా మైఖేల్ వాన్ వరుస పోస్ట్‌లు చేశాడు. ఈ సారి భిన్నంగా వాన్ ట్వీట్ చేశాడు. కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, బుమ్రా వంటి ఆటగాళ్లు లేకపోయినా ఆసీస్‌పై భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందంటూ టీమ్ఇండియాను వాన్ ప్రశంసించాడు. గిల్, అయ్యర్ శతకాలు సాధించడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్న సమయంలో ఇండియా 400 స్కోరు దిశగా అడుగులేస్తుందంటూ పోస్ట్ చేశాడు.
ఆ తరువాత కాసేటికే మరో పోస్ట్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించిన జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. స్వదేశీ పిచ్‌లపై భారత బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉందని, బౌలింగ్ ఆప్షన్లు బాగున్నాయన్నాడు. ఒక్క ఒత్తిడి మాత్రమే భారత్‌ను ఆపగలదు అని అన్నాడు.
దిష్టిపెట్టకు..
మైఖేల్ వాన్ ప్రశంసల పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సరదాగా స్పందించారు. టీమ్ఇండియాకు దిష్టిపెట్టకు అని అర్థం వచ్చేలా.. మిరపకాయలు, నిమ్మకాయ, బొగ్గు ముక్క వేలాడదీసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటో వైరల్‌గా మారగా మైఖేల్ వాన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చావ్ అంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Kapil Dev : దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ కిడ్నాప్.. !
#INDvAUS https://t.co/CWvpXS5vmH pic.twitter.com/vpZ4rgvI3M
— Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2023