బంగ్లా టెస్టులో కోహ్లీ ముందున్న మైలురాళ్లు

బంగ్లా టెస్టులో కోహ్లీ ముందున్న మైలురాళ్లు

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సొంతగడ్డపై వరుసగా 12వ టెస్టు సిరీస్ గెలిచినట్లు అవుతుంది. 

అంతేకాకుండా కోహ్లీ వ్యక్తిగత రికార్డులను పరిశీలిస్తే..  ఇటీవల దక్షిణాఫ్రికాతో ఆడి డబుల్ సెంచరీ సాధించిన కోహ్లీ బంగ్లాదేశ్ తోనూ అదే ప్రభంజనం సృష్టిస్తాడని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా 5వేల పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీ ఇంకా 32పరుగులు చేయాల్సి ఉంది. కెప్టెన్‌గా 84 ఇన్నింగ్స్ ఆడి 4వేల 968పరుగులు చేసిన కోహ్లీ బంగ్లాదేశ్ జట్టుపై మరో 32పరుగులు జోడిస్తే వేగవంతమైన 5వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు సృష్టిస్తాడు. 

ఇదే కాకుండా కెప్టెన్ గా భారత్ తరపున 19 సెంచరీలు పూర్తి చేసిన కోహ్లీ.. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును 
సమం చేశాడు. ఈ మ్యాచ్ లోనూ సెంచరీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్ గా పాంటింగ్ ను దాటేస్తాడు. అక్టోబరు 2016లో ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్ లోనూ కోహ్లీ డబుల్ సెంచరీతో మెప్పించాడు.