MLC 2025 : కీరన్ పొలార్డ్ మెరుపులు.. సియాటెల్‌పై న్యూయార్క్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.

MLC 2025 MI New York won by 7 wickets against Seattle Orcas
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సియాటెల్ ఆర్కస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సియాటెల్ ఆర్కస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సియాటెల్ బ్యాటర్లలో కైల్ మేయర్స్ (88; 46 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లు) దంచికొట్టాడు.
🚨 FIRST WIN FOR MI NEW YORK IN MLC 2025 🚨
– A terrific run chase, 201 runs from 19 overs against Seattle Orcas, Pollard the Finisher 💪 pic.twitter.com/6mCWWARUEw
— Johns. (@CricCrazyJohns) June 19, 2025
షాయన్ జహంగీర్ (43), హెన్రిచ్ క్లాసెన్ (11 బంతుల్లో 27 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మయర్ (9 బంతుల్లో 21) వేగంగా ఆడారు. డేవిడ్ వార్నర్ (4) నిరాశ పరిచాడు. ఎంఐ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు తీశాడు. మైఖేల్ బ్రేస్‌వెల్, ట్రెంట్ బౌల్ట్, సన్నీ పటేల్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యాన్ని ఎంఐ న్యూయార్క్ 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 14 పరుగులకే ఔటైన మరో ఓపెనర్ మోనాక్ పటేల్ (93; 50 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
మైఖేల్ బ్రాస్‌వేల్ (50; నాటౌట్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (26 నాటౌట్; 10 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు మెరుపులు మెరిపించారు. కెప్టెన్ నికోలస్ పూరన్ (7) విఫలం అయ్యాడు. సియాటెల్ ఆర్కస్ బౌలర్లలో సికిందర్ రజా రెండు వికెట్లు తీయగా కైల్ మేయర్స్ ఓ వికెట్ సాధించాడు.