Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు

భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనంపై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా జట్టులో చేరాలని అనుకుంటున్నానని చెప్పాడు.

Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు

Mohammad Shami

Updated On : September 16, 2024 / 2:11 PM IST

Mohammed Shami : భారత క్రికెట్ జట్టులోకి పునరాగమనంపై ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి గందరగోళం లేకుండా జట్టులో చేరాలని అనుకుంటున్నానని చెప్పాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) వార్షిక అవార్డుల వేడుకలో షమీ మాట్లాడారు. వరల్డ్ టెస్ట్ క్రికెట్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్ కు ముందు జట్టులోకి పునరాగమనంపై తన ఆలోచనను వెల్లడించారు. నేను కొంతకాలంగా గాయం కారణంగా జట్టులో లేను.. త్వరలోనే జట్టులో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా కృషిచేస్తున్నానని షమీ అన్నారు. నేను తిరిగి జట్టులోకి అడుగు పెట్టే సమయానికి మళ్లీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. నా ఫిట్ నెస్ పై నేను కసత్తు చేయాల్సి ఉంది. 100 శాతం ఫిట్ నెస్ సాధించిన తరువాతనే తిరిగి జట్టులోకి వస్తానని షమీ చెప్పారు.

Also Read : Manubhaker : నీరజ్ చోప్రా పోస్టుకు మనుబాకర్ రియాక్షన్.. పెళ్లెప్పుడంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్ల

ప్రస్తుతం నేను గాయం నుంచి కోలుకొని ఫిట్ గానే ఉన్నాను.. నేను బౌలింగ్ చేయడం ప్రారంభిస్తున్నాను. గాయం వల్ల ఎలాంటి సందేహం, అసౌకర్యం కలగకుండా ఆడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఏ ఫార్మాట్ లో అనేది ముఖ్యం కాదు. ఇందులో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ లు ఉన్నాయి. నా ఫిట్‌నెస్‌ను పరీక్షించుకోవడానికి నేను దేశవాళీ క్రికెట్‌లో ఆడవలసి వస్తే నేను ఆడతాను అని షమీ చెప్పారు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు దూరమైన షమీ.. ఆస్ట్రేలియా సిరీస్ లో ఫిట్ నెస్ సాధించాలని భారత మేనేజ్ మెంట్ సహా, అభిమానులంతా కోరుకుంటున్నారు.

Also Read : India Vs Bangladesh : టీ20 సిరీస్‌ నుంచి శుభ్‌మ‌న్ గిల్‌ ఔట్..! ఇషాంత్ కిష‌న్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..

మహ్మద్ షమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. గాయం కారణంగా గత ఐపీఎల్ టోర్నీకి కూడా షమీ దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో.. పూర్తిస్థాయి సన్నద్దతతో జట్టులోకి తిరిగి పునరాగమనం చేసేందుకు షమీ సిద్ధమవుతున్నాడు. 34ఏళ్ల షమీ 2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు తరపున ఆడుతున్నాడు. అతను రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇప్పటి వరకు 64 టెస్టులు, 101 వన్డేలు, 23 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో 448 వికెట్లు పడగొట్టాడు. అతను చివరిసారిగా గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో భారత్ జట్టు తరపున ఆడాడు. ఏడు ఇన్నింగ్స్ లో 24 వికెట్లు పడగొట్టాడు.